సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా...

నంద్యాల ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ లో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ బాషా అధ్యక్షతన నంద్యాల ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఆత్మకూరు బస్టాండ్లో మార్కెట్ యార్డ్ ఈషాక్ బాషా కార్యాలయం నందు నంద్యాల ముస్లిం మత పెద్దలు,  వైనాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా
ఆయన నిండు నూరేళ్ళు కలకాలం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆంద్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని దువా (ప్రార్థనలు) చేశారు. అనంతరం కేక్ కట్ చేసి  కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో వైకాపా మైనారిటీ నాయకులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్  డాక్టర్ ఎస్ ఎం డి నౌమాన్,  నాయకులు సయ్యద్ సలాముల్లా,  ఆరిఫ్ నాయక్, డీఎస్ హబీబుల్లా, గన్ని కరీం, తబ్రేజ్ తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: