ఆ నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందే

రైతులను బాధపెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడలేదు

జానోజాగో, ఐయూఎంఎల్  డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని జానోజాగో, ఐయూఎంఎల్ డిమాండ్ చేశాయి. రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏ ప్రభుత్వం బాగుపడిన సందర్భాలు లేవని పేర్కొన్నాయి. నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఐయూఎంఎల్ పార్టీ కార్యాలయంలో జాతీయ రైతు దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులను సన్మానించారు. నంద్యాలకు చెందిన ఉప్పరిపేట రైతు కె.సోమన్న, నంద్యాల గుడిపాటి గడ్డకు చెందిన ఎల్.మా భాష, బొల్లవరం చెందిన ఎస్ మదర్ వలి తదితర రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఐయూఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా.  జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషాలు మాట్లాడుతూ    జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారన్నారు. భారతదేశ 5వ ప్రధానమంత్రి, 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది.


 

రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. అలాగే వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ తెచ్చినా నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఢిల్లీ రైతులు చేసిన ఉద్యమంలో ఇప్పటికి 30 మంది అమరులైన వారిని వారి కుటుంబాలను రైతులను పట్టించుకోకపోవడం దారుణం అని అలాగే రైతు కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వము బాగుపడిన దాఖలాలు లేవని ఇప్పటికైనా మోడీ గారు రైతు నష్టం కలిగించే చట్టాలను తొలగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐయూఎంఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు  రఫీ ఉద్దీన్ మౌలానా కుమార్ అక్బర్ అబ్బాస్ సాజిద్ జాఫర్  సల్మాన్ ఐయూఎంఎల్  జిల్లా కార్యదర్శి సలాం మౌలానా *జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: