అధికార్లపై ఒత్తిళ్లు ఆపండి....విధులకు సహకరించండి

ప్రజాసంఘాలు, కార్మికులు, విద్యార్థి సంఘాల  ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఆపండి-నిజాయతీగా విధులు నిర్వహించటానికి సహకరించండి అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ఇందిరాగాంధీ సర్కిల్ లో ప్రజాసంఘాలు కార్మికులు విద్యార్థి సంఘాల  ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు కొద్ది రోజుల క్రితం శ్రీ రామ్ అనే సర్కిల్ ఇన్స్ పెక్టర్ ను ట్రాన్స్వర్ చేశారు నెల తిరక్కుండానే ఆ పోలీస్ అధికారి కల్లు దుకాణాలు  మట్కా గ్యాంబ్లింగ్ దొంగతనాలపై ఉక్కు పాదం మోపాడు కొందరికి అది నచ్చక ఎలాగైనా ఆ అధికారిని బదలాయించాలని కొందరు రాజకీయ పావులు కదిపారు అంతేకాక ఎక్కడో తెలంగాణ లో కొద్ది సంవత్సరాల క్రితం గతంలో సీఐ శ్రీరామ్ డ్రైవర్  రాము కు అమ్మివేసిన వాహనం గంజాయి కేసులో ఎవరో దొరికితే వాహనం శ్రీ రామ్ పేరు తో ఉంది అని హంగామా చేయించి మానసికంగా వేధించే పనిలో పడ్డారు ప్రజాసంఘాలు ప్రజలు ఈ విషయంలో నిరసన తెలుపుతూ ర్యాలీ గా బయలు దేరి తహసీల్దారు కు వినతిపత్రం అందజేశారు.


ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ నిజాయతీగా విధులు నిర్వహిస్తూ అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపిన అధికారిపై రాజకీయ ఒత్తిళ్లు చేయటం మానసికంగా తప్పుడు కేసులలో ఇరికించే ప్రయత్నం చేయటం దుర్మార్గమని ఖచ్చితంగా ప్రభుత్వం జిల్లా ఎస్పీ గారు న్యాయవిచారణ చేసి నిజాయతీ అధికారి శ్రీరామ్ బదిలీ ఆపి పోలీస్ అధికారులు కు మానసిక స్థైర్యం నింపాలని నిజాయతీ గల అధికారి హిందూపురం ప్రాంతంలో చేయాలని ప్రజలు కోరుకొంటున్నారని విజ్ఞప్తి చేశారు తూముకుంట పారిశ్రామిక సంఘం నాయకుడు రవి మాట్లాడుతూ సిఐ శ్రీరామ్ పై మానసికంగా కుంగదీయాలని అరాచక శక్తులు ప్రయత్నం చేస్తే కార్మిక సంఘాలు అడ్డుకుంటాయని అన్నారు దండోరా నాయకులు సతీష్ మాట్లాడుతూ దళితుల ఆధ్వర్యంలో సీఐ శ్రీ రామ్ కు బాసటగా నిలుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు దాదాపీర్.తెలుగుదేశం నాయకులు డీఈ.రమేష్.అమర్.ఎస్ సీ సెల్ నాయకులు శివా. వాల్మీకి రాష్ట్ర నాయకులు న్యాయవాది శివా. యువజన జేఏసీ నాయకులు చంద్ర.బీఎస్పీ నాయకులు శ్రీరాములు.ఆర్సీపీ. రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు.ప్రజాసంఘాలు ప్రజలు పాల్గొన్నారు.


 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: