ఎంబిబిఎస్ సీట్లు సాధించిన 

రావుస్ కళాశాల విద్యార్థులు 

విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రావూస్ జూనియర్ కళాశాల యాజమాన్యం వారి ఆధ్వర్యంలో నడుస్తున్న రావుస్ మెడికల్ అకాడమీ నందు శిక్షణ తీసుకున్న ఇద్దరు అమ్మాయిలు ఎంబిబిఎస్ సీటు సాధించినట్లు కళాశాల చైర్మన్ ఏఎంవీ అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నంద్యాల నందు రావుస్ విద్యార్థులు మెడికల్ సీట్లు క్రమం తప్పకుండా సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రోడ్డ సుంకయ్య మాట్లాడుతూ G S బ్లేస్సి అను విద్యార్థిని ACSR గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నెల్లూరు నందు, అలాగే ఎం. హేమలత బాయ్ శాంతిరాం మెడికల్ కళాశాల నందు, నంద్యాల నందు, సీట్లు సాధించినట్లు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా జాతీయ స్థాయి అధ్యాపక బృందంచే రావూస్ మెడికల్ అకాడమీ ద్వారా శిక్షణ ఇస్తూ ప్రతి సంవత్సరము డాక్టర్లను సమాజానికి అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం విద్యా మందిర్ న్యూ ఢిల్లీ వారి స్టడీ మెటీరియల్, షెడ్యూల్స్, లాంగ్ టర్మ్ కోచింగ్  విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: