శిల్ప మహిళా సహకార్ ద్వారా  రుణాల పంపిణీ 

మహిళా బ్యాంక్ చైర్మన్ శిల్పా నాగిని రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ నందు నంద్యాల పట్టణం, చాబోలు, కానాల పల్లె గ్రామాల మహిళలకు శిల్ప మహిళా సహకర్ బ్యాంకు ద్వారా పట్టణంలోని 159 మంది మహిళా సభ్యులకు 19 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ నాగిని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా మహిళా బ్యాంకు చైర్మన్ నాగిని రెడ్డి  మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాల నుండి నంద్యాల నియోజకవర్గంలో మహిళలందరికీ శిల్ప మహిళా బ్యాంకు ద్వారా రుణాలను పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు కూడ 159 మంది మహిళలకు రుణాలను పంపిణీ చేయడం జరిగిందని, కరోన సమయంలో మహిళల కష్టాన్ని గుర్తించి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి రుణాలను పంపిణీ చేయడం జరిగిందని, అలాగే మహిళలు తీసుకున్న రుణాన్ని వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎంతో అభివృద్ధి చెందుతున్నారని, అలాగే వార్డులలో టైలరింగ్ సెంటర్లు చేతి వృత్తి నేర్చుకునేవారికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించి మరింత మందికి రుణాలు అందే విధంగా సహకరించాలని మహిళను కోరారు. అనంతరం శిల్పా మహిళ బ్యాంక్ సభ్యులు మాట్లాడుతూ గతంలో బయట 5 రూపాయలు,  10రూపాయల వడ్డీకి తీసుకుని చాల ఇబ్బందీ పడేవారిమని,  ఇపుడు శిల్పా మహిళ బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉన్నామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి, MLA శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి,  శిల్పా నగిని రెడ్డికి ప్రతేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, శిల్పా సేవసమితి మేనేజర్ లక్ష్మి నారాయణ, బ్యాంక్ మేనేజర్ హరిలీల, శిల్పా మహిళ బ్యాంక్ మహిళ సభ్యులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: