అది రైతు వ్యతిరేక ప్రభుత్వం
కాంగ్రెస్ నేత చింతల మోహన్ రావు
( జానో జాగో వెబ్ న్యూస్ - కర్నూలు జిల్లా ప్రతినిధి)
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రైతులకు ద్రోహం చేసే ప్రభుత్వామని ఏపీ పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు విమర్శించారు. ఈ రోజు నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలపై పోలీసులు అతి నిర్ధాక్షిణ్యంగా,కిరాతకంగా విరుచుకుపడటం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు.ఈ బిల్లులు కేవలం కార్పొరేట్లకు మాత్రమే లాభంచేకూరుస్తాయన్నారు.కేంద్రంలోని పెద్దలకు రైతులు చేస్తున్న ఆందోళన పట్ల కొంచెం కూడా సానుభూతి లేదని దుయ్యబట్టారు.కేంద్రప్రభుత్వం అనాగరికంగా ఆమోదింపచేసుకున్న వ్యవసాయా భిల్లులవల్లరైతులు తమ సొంత పొలంలోనే కూలీలుగా మారతారని
తెలిపారు.కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు మార్కెటింగ్ ఏజెంట్ గా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేసారు.దాదాపు అన్నిరాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న వ్యవసాయ బిల్లులను కోట్లాది మంది రైతులు వ్యతిరేకిస్తున్నకార్పొరేట్ అనుకూల బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు
మన రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు నాయుడు పార్లమెంటులో మద్దతు తెలిపి ఈరోజు మన రాష్ట్రంలో నిమ్మకు నీరెత్తినట్టు గా ఉండటం చూస్తుంటే ఈ రెండు పార్టీలు కూడా మన రాష్ట్రాన్ని మొత్తము బిజెపికి గంపగుత్తగా అప్ప చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ వ్యవసాయ బిల్లుల మీద ఈ రెండు పార్టీలు కూడా ఏ మాత్రం నోరు మెదపడం లేదు ఎందుకంటే ఇద్దరు కూడా తోడు దొంగలే బిజెపి నరేంద్ర మోడీ గారికి భయపడి వారికి కనుసన్నుల్లో మీరు పార్టీలను నడుపుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు అని దుయ్యబట్టారు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉకొటువాసు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను ఒక అనాలోచిత నిర్ణయ ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని వెంటనే ఈ బిల్లును రద్దు చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని దేశవ్యాప్తంగా అన్నిరాజకీయ పక్షాలను కలుపుకొని ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ చింతల మోహన్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉకొట్టు వాసు, సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: