అదే వడ్డీరేట్లు....
చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లు యథాతథం
(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ డెస్క్)
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసికానికి ఒకసారి సవరిస్తుంది. ఈ నేపథ్యంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ పథకాలపై అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను అదేవిధంగా కొనసాగించింది. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసికానికి ఒకసారి మారుస్తుంది. బ్యాంక్ డిపాజిట్ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ పథకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ) వడ్డీ రేట్లు 7.1 శాతం, 6.8 శాతంగా ఉండనున్నాయి.
ఐదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 7.4 శాతం.
ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు 7.6 శాతం
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వడ్డీ రేట్లు 6.9 శాతం
1-5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5.5 శాతం నుంచి 6.7 శాతం మేరకు ఉన్నాయి.
ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ రేటు 5.8 శాతంగా ఉన్నాయి.
Post A Comment:
0 comments: