రైతులపై లాఠీచార్జ్ అమానుషం
ముస్లిం హక్కుల పోరాట సమితి నేత యూనుస్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ మార్చ్ చేపట్టిన రైతులపై లాఠీఛార్జ్ అమానుషమని ముస్లిం హక్కు ల పోరాట సమితి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు. ఎస్.ఎం.డీ.యూనుస్ పేర్కొన్నారు. గురువారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల నిరసనకు ముస్లిం హక్కుల పోరాట సమితిసంపూర్ణ మద్దతు తెల్పుతుందన్నారు. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం సామ్రాజ్యావాదుల లబ్ది కోసం కొత్త కొత్త చట్టాలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన వెల్లడించారు. శాంతియుతంగా ,ప్రజాస్వామ్య పద్దతిలో ఢిల్లీ మార్చ్ కు వెలుతున్న రైతులపై లాఠీచార్జ్ లు భాష్ప వాయువు ను ప్రయోగించటం చాలా దారుణమని దీనిని ఖండిస్తుందని ముస్లిం హక్కుల పోరాట సమితి నాయకులు యూనుస్ తెలిపారు. గత నెల నుంచి దేశ రైతులు రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తు నిరసనలు తెలియజేస్తున్న సంఘ్ పరివార్ ఎజెండా ను అమలు పరిచే బిజెపి ప్రభుత్వం ఆ రైతులతో మాట్లాడటానికి కూడా ముందుకు రావటం లేదని ఈ కొత్త చట్టాలు 1955 లో చేయబడ్డ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యూనుస్ గారు తెలిపారు. నిరసనలు చేస్తున్న రైతులతో మాట్లాడటం వారి సమస్యలను పరిష్కరించకుండా శాంతియుతంగా వస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జ్ మరియు బాష్ప వాయువు ప్రయోగం చాలా హీనమైనదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ,రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తు దేశ ప్రజలను బ్రిటిష్ వారు అణిచివేసినట్లు అణిచివేయాలని కుట్రలు జరుగుతునాయి .నేడు రైతులకు వ్యతిరేకంగా పోలీసులు (జవాన్) నిలబడ్డారు."జై జవాన్ జై కిసాన్" నినాదంలోని కిసాన్ లపై జవాన్ లతో దాడి చేయించిన ప్రభుత్వం రేపు ఈ జవాన్ లపై దాడి చేయదు అనే అనుమానం అకర్లేదు.అని తెలిపారు..
Post A Comment:
0 comments: