ఏసీ మెకానిక్ లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి

పని భద్రత కల్పించండి 

- ఏసీ మెకానిక్ ల నూతన కార్యవర్గం ఎన్నిక 

( జానో జాగో వెబ్ న్యూస్ --కర్నూలు జిల్లా ప్రతినిధి)

           వేసవికాలం..మండుటెండలు..ఊపిరి ఆడటంలేదు...ఏసీ మెకానిక్ ను పిలచండి అనే మాటలు అందరి నోటి వెంట వస్తాయి. చల్లని గాలి తెప్పించే ఏసీ మెకానిక్ లకు ప్రభుత్వ పధకాలు అందడం లేదని నూతన కార్యవర్గం ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక ఓ లోడ్జిలో ఏసి టెక్నిషియన్స్, వెల్ఫేయిర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్రంలోని వివిద జిల్లాలకు చెందిన ఏసీ మెకానిక్ ల అధ్యక్షులు, ప్రముఖులు  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీ మెకానికులు వయసులో ఉన్న సమయంలోనే పని చేసుకునేందుకు వీలవుతుందని, వయసుమల్లితే పని చేయడం కష్టమన్నారు.


 

ఏసీ మెకానిక్ లను ప్రస్తుతం ఎలెక్ట్రిషియన్లగా చూస్తుందని వాపోయారు. ఏసీ మెకానిక్ లను భవన కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో 100 రోజుల పని దినాలు వుంటాయని, మిగతా 265 రోజులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. నంద్యాలలో సుమారు ఈ వృత్తిని నమ్ముకొని 140 మంది ఉన్నారని,  ప్రభుత్వ పథకాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఐక్యమత్యంగా ఉంటే బాగుంటుందని సూచించారు. ఏసీ మెకానిక్ లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు రామారావు, జానీ, శివనారాయణ, రాంబాబు, హకీమ్, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం అధ్యక్షులుగా మదూసుధన రావు, వైస్ ప్రెసిడెంట్ గా ఫయాజ్, సెక్రెటరీగా జావిద్, జాయింట్ సెక్రెటరీగా అలీం, ట్రెజరర్ గా  సుబ్బారావు, సీనియర్ ఏసీ మెకానిక్ కైలాష్ తదితరులు పాల్గొన్నారు.

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: