టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్దులుగా...

బొంతు రాం మోహన్, జలగం సుధీర్...?

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

త్వరలో జరగబోయే రెండు పట్టభధ్రుల నియోజకవర్గం  ఎమ్మెల్సీ  ఎన్నికల్లో కొత్త అభ్యర్దుల  విషయం లో అధికార టీఆర్ఎస్  పార్టి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం.  ముఖ్యంగా వరంగల్ - ఖమ్మం -నల్లగొండ  నుండి ప్రొఫెసర్ కోదండరాం పోటి చేస్తున్నట్టు వార్తలు అందుతున్న క్రమంలో అక్కడ నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాని, కడియం శ్రీహర్ ని కాని బరి లో నిలిపే ప్రయత్నం చేయటం జరిగింది. ఈ విషయం లో వారిద్దరు అయిష్టత చూపటం తో కొత్త అభ్యర్ది అన్వేషణ లో పార్టి పలువురి అభ్యర్దిత్వాలను  పరిశీలిస్తున్నట్టు సమాచారం.  వీరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి కూతురు కావ్య, గతం లో కోదాడ అసెంబ్లి టికెట్ ఆశించిన కె.టి.ఆర్ సన్నిహితుడు జలగం సుధీర్ పేర్లు చర్చలోకి వచ్చినట్టు ముఖ్య నాయకుల మద్య చర్చ జరుగుతుంది. అదే సమయం లో హైద్రాబాద్-రంగా రెడ్డి - మహబూబ్ నగర్ విషయం లో ప్రొఫెసర్ నాగెశ్వర్ అభ్యర్దిత్వాన్ని బలపరచాలని మొదట్లో బావించినప్పటికి బలమైన అభ్యర్దిని  నిలపాలని అధిష్టానం బావిస్తుంది. ముఖ్యంగా మేయర్ గా పనిచేసి అధిష్టానం కు నమ్మిన వ్యక్తిగా ఉన్న బొంతు రాం మోహన్  విషయం లో సానుకూలంగా ఉన్నట్టు సమచారం. బొంతు ను అభ్యర్దిగా ప్రకటిస్తే ఖర్చంత తామే భరిస్తామని ఆయనకు సన్నిహితంగా ఉండే యువ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు పార్టి కి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు స్థానాలకు జలగం సుధీర్ మరియు బొంతు రాం మోహన్ పేర్లు కె.టి.ఆర్ సీరియస్ పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. కె.సి.ఆర్ చివరి నిమిషం లో తన నిర్ణయం మార్చుకుంటె తప్ప దాదాపు ఈ రెండు పేర్లు ఖారారైనట్టె అని విశ్వసనీయ సమచారం.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: