ఇంటిపన్ను పెంపు ఆలోచన విరమించుకోవాలి 

జానోజాగో... ఐయూఎంఎల్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

పట్టణ ప్రాంతాల్లో ఇంటిపన్ను పెంచే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని జానోజాగో. (ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఐయుఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా డిమాండ్ చేశారు. ఐయూఎంఎల్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మున్సిపల్ మంత్రి అధికారులు మున్సిపల్ శాఖ పై సమీక్ష జరిపినట్లు ఆస్తి పన్ను ఇంటి పన్నులు సవరించే అంశాలపై పట్టణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి కనుక వెంటనే పన్నులు పెంచే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం *జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషామాట్లాడుతూ ఒకవైపు కరోనా ఆర్థిక మాంద్యం తో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురై వ్యాపారాలు దెబ్బతిని ఉపాధి అవకాశాలు కోల్పోయారు బతుకు దెరువుకు వచ్చిన వారు తిరిగి గ్రామాలకే వలస వెళ్ళుతున్నారు ఇటువంటి తరుణంలో పన్నులలో రాయితీలు ఇవ్వాలని వడ్డీలు పెనాల్టీలు రద్దు చేయాలని ఈ క్లిష్ట సమయంలో పన్నులు పెంచాలనే ఆలోచన చేయడం శోచనీయమన్నారు ఇప్పటి వరకు అద్దె విలువ ఆధారంగా పన్ను నిర్ణహిస్తుండగా రాబోయే కాలంలో ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించాలని ప్రభుత్వం ఆలోచించడం దారుణమన్నారు ఇలాగే గతంలో కూడా ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వాలు విషమ షరతులు విధించి సంస్కరణల పేరుతో ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచాలని ప్రయత్నించగా ప్రజలు వ్యతిరేఖిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయని వారు గుర్తు చేశారు కానీ మళ్ళీ అదే ఆలోచనలను వైఎస్సార్ ప్రభుత్వం అమలు జరిపే ప్రయత్నాలు చేయడం గర్హనీయమన్నారు వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: