నిరంతరం పేద ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ

సీపీఐ నేతల వెల్లడి

(జానోజాగో వెబ్ న్యూస్-గొస్పాడు ప్రతినిధి)

 నిరంతరం ప్రజా కార్మిక కర్షక యువజన విద్యార్థి మహిళా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూ అనేక విజయాలను సాధించి పెట్టిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని సిపిఐ పార్టీ గోస్పాడు మండల కార్యదర్శి ఇ చెన్నయ్య అన్నారు.  ఈరోజు స్థానిక గోస్పాడు మండలం గోస్పాడు గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 96 వ వ్యవస్థపకా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా సిపిఐ పార్టీ గోస్పాడు మండల కార్యదర్శి ఇ  చెన్నయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మండల కార్యదర్శి ఇ చెన్నయ్య మాట్లాడుతూ భారత దేశంలో 1925 డిసెంబర్ 26 తేదిన కాన్పూర్ లో కమ్యూనిస్టు పార్టీ స్థాపించారు సుదీర్ఘ ప్రస్థానంలో అనేక కుట్ర కేసులను నిర్బంధాలను నిషేధాలను ఎదుర్కొని భారత స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన నిలిచిందని స్వాతంత్ర్యానంతరం రాజభరణాల రద్దు బ్యాంకుల జాతీయకరణ భూసంస్కరణల చట్టం అమలు కొరకు పట్టు బట్టి వాటిని సాధించింది ఎన్నో ఆటుపోట్లను ఎన్నో ఆవరోదాలు ఎన్నో ఒడుదుడుకులు విరోచిత పోరాటలు నిర్వహిస్తుా పేద పీడిత ప్రజల కోసం ఎనలేని త్యాగాలను చేస్తుా భుామి కోసం భుక్తి కోసం పేద ప్రజల హక్కుల కోసం కార్మిక కర్షక ప్రజలకుా అండగా శ్రమదోపిడికి వ్యతిరేకంగా పాలకుల ప్రజా వ్యతిరేక విదానాలకు వ్యతిరేకంగా ముందుకు కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా పోరాటాలు అపేదిలేదని దేశాన్ని విదేశి బహుళ జాతి కంపెనీల కబంద హస్తాలకుా అప్పగించే కుయుక్తులను ప్రతి ఘటిస్తుాంది అప్పుల ఊబిలో ఉన్న అన్నదాతలకుా అండగానిలచి బతుకు సాగుకుా ప్రభుత్వం సాయమందేలా పోరాడుతుంది పొడు భుాములు అటవీ హక్కుల చట్టం దున్నే వాడిదే భుామి అనే నినాదం భుాపోరాటలు అందులో భాగంగా ప్రతి పేదవాడికి  భూమి దక్కాలని భూమి తప్ప  పరిష్కారం లేదని నిర్ణయించుకున్న పార్టీ సిపిఐ పార్టీ అని  అందుకోసం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రతి వాడికి సాగు భూమి కోసం అదేవిధంగా ఇంటి స్థలాల కోసం అనేక పోరాటాలు చేసి  పేదల కోసం  సాగు భూములు పంపిణీ చేసి కాలనీలు నిర్మించిన ఏకైక ఎర్రజెండా సిపిఐ పార్టీకి ఉందని ఈరోజుకు కూడా భూమి లేని ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు వారందరికీ భూ పంపిణీ చేయాలని ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్న తరుణంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేబట్టి పేదలందరికీ ఇస్తున్నారు సిపిఐ పార్టీగా మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని అయితే ఇళ్ల స్థలాల విషయంలో పేదలంటే అంత చులకనగా ఉన్నట్లు ఉందని అన్నారు ముఖ్యమంత్రి గారికి  భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా  ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు గ్రామీణ ప్రాంతాలలో ఒకటిన్నర సెంటు ఏ మాత్రం పేదవాడికి అనుకూలంగా లేదని కాబట్టి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చి మీ యొక్క విజ్ఞతను  మరింత పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము పెట్టుబడి దారి సమాజం విసిరిన నోట్ల మత్తులో వాగ్దానాల ఒరవడిలో తడబడుతుా తుాలుతుా ఉన్న ప్రజలు భ్రమలు మత్తు వీడనాడలి కేంద్రంలో బిజెపి  ప్రభుత్వం తీసుకొచ్చిన నుాతన వ్యవసాయ 3 నల్ల చట్టాలు రైతులకుా రక్షణ కల్పించలేని చట్టాలు రైతులకు వురితాళ్లుగా  బిగిస్తుాన్నారు రైతులతో చెలగాటం అడుతుా రైతులను రోడ్లుపైకి తీసుకొస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో మహిళా చట్టాలు తీసుకొచ్చిన మహిళలకుా రక్షణ లేకుండాపోయింది ఆ చట్థాలు వున్నవాళ్ళలకు ఊడిగం చేస్తుాన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై దాడులు సజీవ దహనం చేస్తున్నా చోద్యం చుాస్తుాన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రుార మృగాల నుండి మహిళల ప్రాణాలు కాపాడనికి  ఉన్న మహిళ రక్షణ చట్టాలు మరింత బలోపెతం చేయ్యాలని వీటి సాధన కోసం మరిన్ని పోరాటాలు చేస్తూ పేద ప్రజలకు అండగా సిపిఐ పార్టీ అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షులు అన్వర్ భాష రైతు సంఘం మండల కార్యదర్శి సాదే శేఖర్ ఏపీ మధ్యాహ్న భోజన పథకం మండల కార్యదర్శి దస్తగిరమ్మ పసురు పాడు శాఖ కార్యదర్శి జిలాన్ భాష మౌలా ఆకాష్ నాగరాజు గాబ్రియల్ కరుణాకర్ రాజు రవి కాశీ తదితర నాయకులు పాల్గొన్నారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: