ఆ చట్టాలను రద్దు చేసే వరకు పోరు ఆగదు 

వామపక్ష రైతు సంఘాల హెచ్చరిక

( జానో జాగో  వెబ్ న్యూస్ -నంద్యాల ప్రతినిధి)

రైతులకు నష్టం కలిగించే మూడు వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనను చేపడతాం అని రైతు సంఘం హెచ్చరించింది. స్థానిక సాయిబాబా నగర్ లోని సిపిఐ పార్టీ ఆఫీస్ లో వామపక్ష రైతు సంఘాలు, ప్రజా సంఘాల , కార్మిక సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశం రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కే ప్రసాద్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు శంకర్, రైతు  సంఘం కార్యదర్శి సోమన్న, నరసింహులు, ఆవాజ్ కమిటీ జిల్లా నాయకులు మస్తాన్ వలీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సుబ్బరాయుడు, సద్దాం హుస్సేన్, సి ఐ టి యు సి కార్యదర్శి గౌస్ నాయకులు మద్దులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేష్ ,విష్ణు, చైతన్య, ప్రజా సంఘాల హుస్సేన్ ,నాగరాజు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసింత వరకూ రైతులకు మద్దతు ఉద్యమాలు నిర్వహిస్తామని వారు  అన్నారు. అందులో భాగంగా ఈ నెల 12 తారీకు టోల్ గేట్ దగ్గర దిగ్బంధం కార్యక్రమం చేపడుతున్నామని అదేవిధంగా 14వ తేదీ  కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందట నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు అన్నారు, రైతుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందించి రైతులకు న్యాయం జరిగేంత వరకు వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అని వారు అన్నారు.*

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: