సత్వర చర్యలు తీసుకోండి
బీజేపీ నేత సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)
ఏలూరులో ఐదువందల మందికి పైగా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవ్వడం ఆందోళకరమైన అంశమని, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని పరిస్థితిని అదుపులోనికి తీసుకురావాలని బీజేపీ మైనార్టీ మోర్చా జోనల్ ఇన్ ఛార్జ్ సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. ఏలూరులో యుద్ద ప్రాతిపదికన నిపుణులతో మెరుగైన వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అంతుపట్టిన వ్యాధితో ఒకరు మరణించారని, అతనికి కుటుంభానికి రూ.20లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు సత్వరమే వైద్యం అందేలా చూడాలని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తాగు నీటి సరఫరాపై వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విపత్తుల సమయంలోనూ ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా విపత్తులతో, మానవ తప్పిద ఘటనలతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ఇలాంటి ఉద్దంతాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి మానవ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు.
Post A Comment:
0 comments: