పెంచిన గ్యాస్ ధరలను రద్దు చేయాలి
జానో జాగో, ఐ యు ఎం ఎల్ డిమాండ
సిలిండర్ లతో నిరసన
( జానో జాగో వెబ్ న్యూస్ -నంద్యాల ప్రతినిధి)
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ జానోజాగో సంఘం, ఐ యు ఎం ఎల్ నిరసన వ్యక్తం చేశాయి. నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్ దగ్గర 15 రోజుల్లో రెండు సార్లు 50 రూపాయల చొప్పున వంద రూపాయలు పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐ యు ఎన్ ఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా జిల్లా ఉపాధ్యక్షులు మౌలానా రఫీ ఉద్దీన్ డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం వలన, రవాణా రంగంపై భారం పడి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య,మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే శక్తి లేక ఆకలితో అలమటిస్తున్నారు.కరోనా కష్టకాలంలో మరల గ్యాస్ ధరలు పెరిగి పోయ్యి ముట్టించుకోలేక,జీవించలేని పరిస్థితి ఉన్నది.ప్రజల జేబులు కొట్టి కార్పోరేట్ సంస్థల జేబులు నింపుతు,
అంబానీ,ఆదానీ కడుపులు నింపుతు ప్రజల కడుపులు కాల్చుతూ,ధరలు పెరిగి బాధల్లో ఉన్న ప్రజలపై మరల వంటగ్యాస్ పెంచడం గోరుచుట్టుపై రోకటి పోటులా భారాలు వేసిన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఐ యు ఎమ్ ఎల్ ఏ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: