సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ ఇక లేరు

పలువురు ప్రముఖులు, జర్నలిస్టుల సంతాపం

సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్

(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ ఇక లేరు!  కాసేపటి క్రితం కనుమూశారు!  వార్త లో స్పెషల్ కరెస్పాండంట్ గా అనేక వార్తలు రాసి ఆనాటి ముఖ్యమంత్రులను హడల్  ఎత్తించిన  మారుతి ప్రసాద్ ప్రస్తుతం కాస్మోస్  న్యూస్ నెట్ వర్క్ ఎండీ గా వ్యవహరిస్తున్నారు! మంచి మానవతావాది, నలుగురికి సాయం చేసే మనస్తత్వం, అందరితో స్నేహంగా మెలిగే  తత్వం వెరసి మారుతి ప్రసాద్ లేని లోటు జర్నలిజం లో ఒక మార్క్!  అక్రమ మద్యం వార్తలతో ప్రాణాలకు  సైతం లెక్కచేయకుండా సంచలనాత్మక వార్తలు అందించారు. ధూల్ పేట్ వార్తలను రాష్ట్ర స్థాయి లోకి తీసుకెళ్లి సంచలనాత్మక వార్తలు రాశారు!  ముఖ్యమంత్రులు నందమూరి తారకరామారావు  నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు అందరూ ఆయనకు మిత్రులే !  శృతిలయ సంస్థ ఆమని గారి ద్వారా ఉత్తమ జర్నలిస్ట్ గా ఉగాది పురస్కారం ఇప్పించి ఆనాటి స్పీకర్  మధుసూధనా చారి ద్వారా సత్కరింపజేసాను!  రవీంద్రభారతి వేదిక పై నన్ను కౌగలించుకుని ఎన్నో సంచలనాత్మక వార్తలు రాస్తే, మిత్రుడుగా నీ ద్వారా గుర్తింపు వచ్చింది అంటూ కంట నీరు పెట్టుకున్నారు!   ముక్కు సూటి మనిషి!  కెరీర్ లో ఎక్కడా రాజీ పడలేదు!  ధైర్యంగా ఎదురీదిన  జర్నలిస్ట్!  పెద్దగా సంపాదించుకున్నది  లేదు!  మొన్నీ మధ్య సింగర్ మనో నంబర్ అడిగితె ఇచ్చాను, డబ్బులు అడుక్కోను, కానీ, అయన పాట విన్నాను, మా జిల్లా వాడు కదా అభిమానం అభినందించాలి అన్నారు! ఎలాంటి భేషజాలు లేని అసలు సిసలు జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ అని కళా పత్రిక సంపాదయులు రఫీ  అశ్రు నివాళి ఆర్పించారు. ఆయనతోపాటు నంది అవార్డు గ్రహిత, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డీ.అబ్దుల్, జానోజాగో వెబ్ న్యూస్ సీఈఓ సయ్యద్ నిసార్ అహ్మద్ కూడా తమ సంతాపాన్ని ప్రకటించారు. మారుతి ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: