నా ఖాతా లో మరో రెండు జాతీయ పురస్కారాలు
కళా పత్రిక సంపాదకులు రఫి
ఉత్తమ జర్నలిస్ట్ గా జాతీయ అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు నాకు కొత్తేమి కాదు! 18 దేశాల్లో నేను అంతర్జాతీయ పురస్కారాలు, ఆరు పర్యాయాలు జాతీయ స్థాయి పురస్కారాలు ప్రశంసలు అందుకున్నాను! నా పాతికేళ్ల జర్నలిజం కెరీర్ లో వందలాది పురస్కారాలు, వేలాది సన్మానాలు పొందాను! దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు వివిధ రాష్ట్రాలు దేశాల్లో పేరొందిన తెలుగు సాంస్కృతిక సంస్థలు పలు మార్లు సత్కరించి గౌరవించాయి!
అయితే, కరోనా క్లిష్ట సమయం లో నేను అందించిన సేవలను గుర్తించి గత శనివారం ఢిల్లీ లోని పార్క్ హోటల్ లో జరిగిన సన్మానం, అందుకున్న రెండు పురస్కారాలు నాలో కొత్త ఉత్సాహాన్ని అందించాయి ! ఎందుకంటే నేను స్వీకరించిన పురస్కారాల్లో ఒకటి జన సేవా జాతీయ సద్భావనా పురస్కారం, మరొకటి కోవిద్ 19 వారియర్స్ జాతీయ అవార్డు! ఈ పురస్కారాలు నా దృష్టిలో మామూలువే అయినా, ఇచ్చిన సంస్థలు మామూలువి కావు; హిందూత్వం పెంచి పోషించి ప్రోత్సహించే భారతీయ జనతా పార్టీ కి చెందిన అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, భారత్ వికాస్ పరిషత్ తో పాటు యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ సంస్థలు ! మహ్మద్ రఫీ అనే నన్ను ప్రత్యేకంగా రెండు జాతీయ పురస్కారాలతో సన్మానించాయి ! ఈ సత్కారం అందుకున్న వారిలో భారత దేశం లోనే తొలి ముస్లిం జర్నలిస్ట్ నేను అని ఆచార్య మహా ప్రభా కిరణ్ ప్రకటించారు! అంతే కాదు, ఆయా సంస్థల చరిత్రలో తొలి సారి ఈ సన్మానాలు పొందిన ముస్లిం గా మరో రికార్డ్ అని సగర్వంగా ప్రకటించారు!
ఈ జాతీయ సదస్సు లో బీజేపీ సీనియర్ నేత డాక్టర్ ఆర్.ఎస్.ఆహ్లావత్, ఇండియన్ ఇంస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వివేక్ దీక్షిత్, యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఆచార్య మహా ప్రభా కిరణ్, భారత్ వికాస్ పరిషత్ చైర్మన్ శ్రీ నరేంద్ర జైన్, ఐఆర్ఎఐ, పూసా డైరెక్టర్ డాక్టర్ వీర్ పాల్ సింగ్, ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ మనీష్ గోగియా, విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి శ్రీ మహేంద్ర సింగ్ రావత్, కేంద్ర ఎన్ఎఎఫ్ఇడి డైరెక్టర్ శ్రీ అశోక్ ఠాకూర్, ఢిల్లీ యూనివర్సిటీ ఆచార్య డాక్టర్ సుభాష్ కుమార్, క్లినికల్ రీసెర్చ్ నెట్వర్క్ ఇండియా సిఇఓ డాక్టర్ అనిత్ సింగ్ పాల్గొని దేశ ఆర్ధికాభివృద్ధిలో పౌర హక్కులు, పిల్లల ఆలోచనల పై సమాజం లో నెలకొన్న పరిస్థితులు అంశాలపై ప్రసంగించి పలు తీర్మానాలు చేశారు! దేశం లోని అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రంగాలకు చెందిన 22 మంది ప్రముఖులను పురస్కారాల కోసం ఎంపిక చేసి సత్కరించి అభినందించారు. అందులో నేనూ ఉండటం సంతోషదాయకం! మీలాంటి ఆత్మీయ మిత్రులతో పంచుకోవడం మరింత ఆనందం!
Post A Comment:
0 comments: