ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిన....

నంద్యాల ఎంపి పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిలు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శుక్రవారం సాయంత్రం నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలో నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి లతో కలసి నవరత్నాలు - పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పట్టాలు పంపిణీ గావించి ఇళ్లకు భూమిపూజ గావించారు. ఈ సందర్బంగా నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ

 

మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చు తున్నారని, మన రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన పేద వారందరికీ డి పట్టాను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ స్థలంలోనే సొంత ఇండ్లకు భూమి పూజ కూడా చేశామని, త్వరలో నిరుపేద తన సొంత ఇంటిలో నివసించే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారు. అనంతరం నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పండుగ,  వైకుంఠ ఏకాదశి శుక్రవారం శుభ దినమున నిరుపేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరుపుకునేలా చేసినందుకు  నంద్యాల నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. మన నియోజకవర్గంలో 1976 పట్టాలను పంపిణీ గావిస్తున్నామని,  ఒక పెద్ద కొట్టాల గ్రామంలొనే మూడు ఎకరాల 44 సెంటర్లలో ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు ప్రకారం 153 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామని, సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి గాను 204 మందికి గృహాలను కూడా మంజూరు చేశామన్నారు. ఒక పెద్ద కొట్టాల గ్రామానికి ఒక కోటి యాభై లక్షల రూపాయల నిధులతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేద అక్కాచెల్లెమ్మళ్లకు ఇళ్ల పట్టాల పంపిణీ గావించడం బృహత్తర కార్యక్రమం అన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఇటువంటి కార్యక్రమం నేటి నుండి 15 రోజులపాటు పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 76 వేల ఇళ్ల పట్టాలు స్థలాలు పంపిణీ గావించుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇళ్లు లేని అక్కచలమ్మ లందరికీ 17,005 వైయస్ ఆర్ జగనన్న కాలనిలలో లెఔట్లు వేసి ఇండ్ల స్థలాలు ఉచితంగా ఆదిచుచునరని అదే కాలనీలో సుమారుగా 6800 కోట్ల రూపాయల వ్యయంతో త్రాగునీరు, రోడ్లు. డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నారని, ఆ స్థలంలోనే ఉచిత పక్కా ఇళ్లను కూడా నిర్మించనున్నామన్నారు.
రాష్ట్రంలోని పేదలందరికి శాశ్వత గృహ వసతి కల్పించాలన్న సదుద్దేశంతో రెండు దశల్లో 28 లక్షల 30 వేల ఇళ్లు మొదటి దశలో 28,080 కోట్ల రూపాయల వ్యయంతో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి నేటి నుండి మన ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇల్లులేని పేద అక్క చెల్లెమ్మలకు రు21,345 కోట్ల విలువగల 2.62 లక్షల టిడ్కో ఇళ్లను సేల్ అగ్రిమెంట్ కూడా ఇదే రోజు అందించుచున్నామన్నారు. మన ప్రభుత్వం నిర్మిస్తున్నది కేవలం ఇండ్లు కావని అవి ఊర్లుగా వేదజల్లుతాయన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి డి రమణయ్య, హౌసింగ్ ప్రత్యేక అధికారి రామ సుబ్బయ్య,  నంద్యాల తహసీల్దార్ రవికుమార్,  నంద్యాల డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ భాస్కర్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ భాష,  భాష్యం జగదీశ్వర్ రెడ్డి, విజయ శేఖర్ రెడ్డి గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: