ముస్లిం జనాభా పెరుగుదల...
అంతా దుష్ప్రచారం...?
ఈ తేడా గమనిస్తే చాలు ఎవరివి ఉద్దేశ పూర్వక వ్యాఖ్యలో
ఏ ఆధారంలేకుండా నోటికొచ్చిన ఏ విమర్శ చేసినా సరే ముస్లిం సమాజంపై వేస్తే అది నిజమై పోతుంది. ఇది యావత్తు ప్రపంచంలో నెలకొన్న దుస్థితి. ముస్లింలను ఉద్దేశించి అప్రతిష్టపాలుజేసేందుకు నిరంతరం చేస్తున్న దుష్ప్రచారం ముస్లింలు కావాలనే సంతానం పెంచుతున్నారు అని. ఇది మన దేశంలోని బీజేపీ నేతల నోటి నుంచి వచ్చే సాధారణ మాట. కానీ వాస్తవం ఏమిటీ...? ముస్లింల జనాభా నిజంగా పెరుగుతోందా...? లేక తగ్గుతోందా... అంటే ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముస్లింల జనాభా తగ్గుతోందని వివిధ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.
ముస్లిం “జనాభా పెరుగుదల బాంబ్" ప్రచారకుల వాదన విమర్శలకు గురి అయినది., భారతదేశంలో "ముస్లిం జనాభా పెరుగుతున్న ముప్పు" అనే ఒక తాజా నివేదికప్రకారం ముస్లిం కమ్యూనిటీ యొక్క సంతానోత్పత్తి రేటు ఇతర వర్గాలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్నట్లు సర్వేలో తేలింది. "హిందూ మతం పేరు చెప్పి జాతీయవాదులుగా మెలుగుతున్నవారు తరచుగా ముస్లిం జనాభా పెరుగుదల గురించి ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. 2001 మరియు 2011 మధ్యకాలంలో భారతదేశంలో ముస్లింల శాతం 0.8 శాతం నుంచి 14.2 శాతానికి పెరిగింది. ఈ పరిస్థితిని కొనసాగించినట్లయితే 2025 నాటికి హిందువుల సొంత దేశంలో వారి ఉనికి గురించి మనం మరచిపోవాలి, " అని గత సంవత్సరం ఒక ప్రధాన హిందూ జాతీయవాద సంస్థ నాయకుడు చెప్పారు. "కానీ వాస్తవంగా భారతదేశంలో ముస్లింలు, హిందువుల మధ్య సంతానోత్పత్తి అంతరం తగ్గుతుంది. సంతానోత్పత్తి అంతరం విబిన్న రాష్ట్రాల మద్య ఉంది, మతాల మద్య లేదు. బీహార్ లో హిందూ మహిళలు ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మహిళల కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నారు"అని ది అట్లాంటిక్ పేర్కొంది, ది హిందూ 2015 ఒక ప్రత్యేకమైన అన్వేషణ నివేదిక ప్రకారం ఇది తేలింది.
"ఇలాంటి ఆందోళనలు ఫ్రాన్స్, జర్మనీ, యు.కె., నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ దేశాలలో వలస వ్యతిరేక ప్రసంగాలు జరుగుతున్నవి. ఈ దేశాలలో ముస్లింలు మొత్తం జనాభాలో 10 శాతానికి కంటే తక్కువగా ఉన్నారు.
"ఫ్రాన్స్ లో దాదాపు 7.5 శాతం మంది ముస్లింలు ఉన్నారు, కాని ఫ్రెంచ్ ప్రజలు ముస్లింలు దేశంలో ముగ్గురు వ్యక్తులలో ఒకరు ఉన్నారు అని నమ్ముతారు. ప్రస్తుత పడమటి ఐరోపాలోని ముస్లిం మహిళలు ముస్లిమేతర మహిళల కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నారు, కాని పరిశోధకుల అభిప్రాయం ప్రకారం పడమటి ఐరోపాలోని ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేటు చాలా వేగంగా క్షీణిస్తుంది, వారి సంతానోత్పత్తి రేట్లు కాలక్రమేణా తగ్గుతాయి " అని ది గార్డియన్, పీఆర్ బీ (జనాభా సూచనల బ్యూరో)ను ఉదాహరిస్తూ దిఅట్లాంటిక్ పేర్కొంది.
ది అట్లాంటిక్ తన నివేదికలో ముస్లిం ఫర్టిలిటి రేట్ పెరుగుదల(బర్మా తప్పితే) అనే మిధ్య భావన ప్రపంచవ్యాప్తం గా ఉంది, అది నిస్సందేహంగా తప్పుడు భావన అంటున్నది. ది అట్లాంటిక్ ఇలా అంటున్నది, "ప్రపంచ ముస్లిం జనాభా వేగవంతంగా పెరుగుతోంది కానీ ప్రపంచం లోని వివిధ ప్రాంతాలలో ముస్లిం జనాభా అంతే వేగంతో అభివృద్ధి చెందడం లేదు. ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్న సబ్-సహారన్ ఆఫ్రికాలో ప్రాంతం లో ముస్లింలు సాంస్కృతికంగా ప్రత్యేకమైన మైనారిటీలు.
ఇస్లాం బ్రుణ హత్యలను ప్రోత్సహించదు. అట్లాంటిక్ ప్యూ రీసెర్చ్ ను ప్రస్తావిస్తు ఇలా చెప్పింది, "ప్యూ నివేదిక ప్రకారం సంతానోత్పత్తికి మతం తో సంభందం లేదు. ఆర్థిక, సామాజిక సేవలు, మహిళా సాధికారత, సంఘర్షణలతో దగ్గిర సంభందం కలిగి ఉంటుంది. "1990-95మద్య అన్ని 49 ముస్లిం మతం-మెజారిటీ దేశాల్లో మహిళలసంతానోత్పత్తి శాతం 4.3 పిల్లల నుండి 2010-2015 లో 2.9 కు పడిపోయింది. ఇది 2015 లో ప్రపంచ సంతానోత్పత్తి రేటు కంటే ఎక్కువగా ఉంది. కానీ అదే కొన్ని పాశ్చాత్య యూరోపియన్ దేశాలలో స్త్రీలకు సరాసరి సంతానం ఆరు నుంచి మూడింటికి తగ్గటానికి దాదాపు శతాబ్దం పట్టింది."
"ఆధునిక చరిత్రలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ లో వేగంగా సంతానోత్పత్తి తగ్గింది 1950 లో, ఇరానియన్ మహిళలకు సరాసరి ఏడుగురి పిల్లలు ఉన్నారు, ఈ రోజు వారు అమెరికన్ల కంటే తక్కువగా1.68 మందిని కలిగి ఉన్నారు" అని నివేదిక పేర్కొంది.
Post A Comment:
0 comments: