ఒకే సారి మూడు చిత్రాలతో...

పరిచయమవుతున్న కృతి

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

టాలెంట్,  అదృష్టం ఉంటే అవకాశాలు వాటంతటవే.. వెతుక్కుంటూ వస్తాయి... హైదరాబాద్ లో ఉంటున్న వైజాగ్ కు చెందిన దేవీ కృతి రాజ్ కి సినిమాలు అంటే ప్రాణం. నటన అంటే పిచ్చి. సినిమాల్లో నటించాలనే ఆసక్తి తో డాన్స్ కూడా నేర్చుకుంది. కొన్ని ఆడిషన్స్  కు కూడా అటెండ్ అయింది. ఒకే గుడ్ టాలెంట్ అన్నారే కానీ అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. ఇదే సమయంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన  సీనియర్ జర్నలిస్ట్ అయిలు రమేష్ దృష్టిలో పడింది కృతి రాజ్. అయిల్యూస్ మీడియా హౌస్ బ్యానర్ పైన స్వీయ దర్శకత్వంలో అయిలు రమేష్ నిర్మించిన "ప్రేమా నీకో నమస్కారం" చిత్రంలో హీరోయిన్ గా కృతి కి అవకాశం దక్కింది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండగానే..మరో రెండు చిత్రాల్లో కృతి హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. 

ఎస్ ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై అయిలు రమేష్ దర్శకత్వంలో శ్రీనివాస్ ఆసంపల్లి నిర్మించిన "సత్య" చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అలాగే గట్టు సినిమాస్ బ్యానర్ పై అయిలు రమేష్ దర్శకత్వంలో రాధిక గట్టు నిర్మించిన "లిప్ లాక్ డౌన్" హాస్య భరిత చిత్రంలో కృతి రాజ్ హీరోయిన్ గా నటించింది.  ఈ మూడు చిత్రాలు జనవరిలో విడుదల అవుతున్నాయి. ఒకే సారి మూడు చిత్రాల తో తెరకు  పరిచయం కావడం తనకు అరుదైన అవకాశం, అదృష్టం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు నటి కృతి రాజ్.



















 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: