హత్య చేసిన దుండగులను ఉరి తీయాలి

పీవైఎల్ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)

స్నేహలతను హత్య చేసిన దుండగులను ఉరి తీయాలని పీవైఎల్ డిమాండ్ చేసింది. నందికొట్కూరు పట్టణంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో లో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు నవీన్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ  నిన్నటి రోజున  అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే అమ్మాయి హత్యకు కారణమైనటువంటి నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జరిగింది పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు.పేరుకు మాత్రం దిశా నిర్భయ చట్టాలు అని చెప్పుకుంటూ అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వైఫల్యం చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్నేహలత వాళ్ళ అమ్మ అనంతపురం వన్టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాకు కొందరి వల్ల అపాద ఉంది అని కేసు పెట్టండి అని వేడుకున్నా కేసు పెట్టకుండా వ్యవహరించినటువంటి సీఐ ఎస్ఐ సార్ గారి పై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ అమ్మాయికి న్యాయం చేసి మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని వారు అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: