వైభవంగా ...

నిర్మాత  డా. సి. వి రత్నకుమార్ జన్మదిన వేడుక

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

సినీ నిర్మాత, రాన్సాక్ ఆర్గా సీఈఓ  డా. సి. వి రత్నకుమార్ 60 వ జన్మదిన వేడుక కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య అత్యంత  వైభవంగా జరిగింది. 22. 12. 1960లో చింతలచెర్వు వెంకటరామారావు-లక్ష్మీ ప్రమీలాదేవిలకు జన్మించిన రత్నకుమార్ మంచి మనసుకు పెట్టింది పేరుగా తండ్రికి తగ్గ తనయుడిగా విశేష పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. బయో ఉత్పత్తులను రైతుల వద్దకు చేర్చి రైతే రాజ్యంగా నిలిచేలా చేశాడు. రాన్సాక్ ఆర్గా సీఈఓగా  రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేశారు. ఓ వైపు  రాన్సాక్ ఆర్గా సీఈఓ గా భాద్యతలు నిర్వర్తిస్తూనే మరో వైపు చలనచిత్రరంగంలోకి ప్రవేశించి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆటో బయోగ్రఫీ నేపథ్యంతో 'మూర్కుడు' అనే చిత్రాన్ని నిర్మించారు.

 నిర్మాత  డా. సి. వి రత్నకుమార్

ఆ చిత్రం అంతా కొత్తవారితో తెరకెక్కించారు. నిర్మాణాంతర పనులన్నీ పూర్తి చేసుకున్న 'మూర్కుడు' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. డా. సి. వి రత్నకుమార్ కు  జన్మదిన శుభాకాంక్షలు అందజేసిన వారిలో నేచర్ అగ్రి సొల్యూషన్సు మేనేజింగ్ డైరెక్టర్ పంచాంగం బాబు వరద రాజేంద్రప్రసాద్,  రాన్సాక్ ఆర్గా జనరల్ మేనేజర్ ఎం. మురళీకృష్ణ, ఆర్గానిక్ ఇండియా  సీఈఓ  సి. వి భరద్వాజ్, విట్రోలైఫ్ సైన్సెస్ సీఈఓ ఘంటసాల కృష్ణ చైతన్య-జానకీ సృజన, ధ్రువ ఆర్యన్ ( రత్నకుమార్ ముద్దులమనవడు),  ఘంటసాల శ్రీ మహాదేవ్, సి.వి విజకుమార్ - వసుంధర, గణేష్ సి.వి.ఆర్ (గవేజ్ ఆర్గానిక్సు), ఐ,.టి.డి.ఏ ఇంజనీర్ మంచికంటి శ్రీనివాసరావు-రుక్మిణి, కలపటం కుటుంబరావు-గిరిజారాణి, సి.వి. మురళీకుమార్- మాధవి, అవినో బయోటెక్ సీఈఓ  ప్రభాకర్-కళ్యాణి, నాగేశ్వరరావు (ఓజోన్ ఆర్గానిక్సు), సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, చీఫ్ సబ్ -ఎడిటర్ ఎం.డి. అబ్దుల్, దర్సకలు ఎన్. శంకర్, ముప్పిడి సత్యం-నిర్మల, హీరో సుమన్, సీనియర్ నటులు చంద్రమోహన్, జగదీశ్ (మూర్కుడు చిత్ర కెమెరామెన్ )లు ఉన్నారు. డా. సి. వి రత్నకుమార్ నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని వారు  జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.

నిర్మాత  డా. సి. వి రత్నకుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు  

 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: