హుషారుగా సాగిన క‌వితా ప‌ఠ‌నం

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

తెలుగు ముస్లిం ర‌చ‌యిత్రుల వేదిక అంకుర్ స‌భ్యుల మూడో క‌ల‌యిక ఎంతో ఉత్సాహంగా జ‌రిగింది. స‌భ్యులు తాము రాసిన క‌విత‌లు చ‌ద‌వ‌డంతోపాటు ముస్లిమేత‌రుల‌తో ముస్లిం స్త్రీల సంఘీభావ క‌విత్వాన్ని ఆహ్వానిస్తూ... సీనియ‌ర్ క‌వుల స‌మ‌క్షంలో ఒక రోజు స‌ద‌స్సును ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి... 2019 జ‌న‌వ‌రి 25వ తేదీన ముస్లిం స్త్రీలు సామాజికంగా ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై స‌ద‌స్సు ఏర్పాటు చేయ‌డం.- ముస్లిం స్త్రీల స‌మ‌స్య‌ల‌పై ముస్లిమేత‌రు(క‌వ‌యిత్రులు, క‌వులు)ల నుంచి క‌విత్వాన్ని ఆహ్వానించ‌డం వంటి తీర్మానాలు చేశారు. అనంత‌రం స‌భ్యులు త‌మ త‌మ క‌విత‌లు చ‌దివి వినిపించారు.
సమావేశంలో పాల్గొన్న తెలుగు ముస్లిం ర‌చ‌యిత్రులు

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: