నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో....

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

పీడీఎస్ యూ, పీవైఎల్ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)

 నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని,ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ), ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్)నందికొట్కూరు డివిజన్ కమిటీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డి.రఫీ, పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు  కె.నాగరాజు,ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్)జిల్లా నాయకులు నవీన్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో త్రాగునీరు, మరుగుదొడ్లు మరియు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని,కాంట్రాక్ట్ పోస్టులను రెగులర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పునఃప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు.మండలంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యాలు లేవని, విద్యాసంస్థలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి దరఖాస్తు గడువును పొడగించి పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వానికి కోరారు.కరోనా నిబంధనలు పాటించని ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పై విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని నందికొట్కూరు తహశీల్దార్ రూపలత గారికి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే పీడీఎస్ యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో ఉద్యమాలను నిర్వహిస్తామని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ డివిజన్ నాయకులు కార్తిక్,శంకర్ ఆచారి, హరికృష్ణ,ఫయాజ్ బాష,ప్రభాకర్,మహేష్,అంజి బాబు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: