క్షేత్రస్థాయిలో భూముల రీ సర్వే అవగాహన సదస్సులు ప్రారంభం

నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

( జానో జాగో వెబ్ న్యూస్- కర్నూలు జిల్లా ప్రతినిధి)

 క్షేత్రస్థాయిలో భూముల రీ సర్వే అవగాహన కార్యక్రమం ప్రారంభమైందని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. సోమవారం నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామంలో క్షేత్ర స్థాయిలో జరిగిన భూముల రీ సర్వే అవగాహన కార్యక్రమానికి నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి హరినాథ్ రావు,  నంద్యాల తహసీల్దార్ రవికుమార్,  కోనేటి రంగారావు కమిటీ తహసీల్దార్ జనార్దన్ శెట్టి, నంద్యాల డి ఐ గురు స్వామి తదితరులు హాజరైనారు. అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ జగన్ అన్న శాశ్వత భూ హక్క, భూ సంరక్షణ పథకంపై ప్రజలకు అవగాహన కలిగేలా అధునాతన సర్వే పరికరాలతో ఎలా సర్వే చేస్తారు అనే విషయం పై ఈనెల 14వ తారీకు నుండి 19 వ తారీఖు వరకు నంద్యాల డివిజన్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.


ఇలాంటి కార్యక్రమాన్ని భూ యజమానుల అందరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ పథకం ద్వారా ఖచ్చితమైన కొలతలు మీరు చూపిన హద్దులలో మీ సమక్షంలోనే సర్వే చేయడం భూ రక్షణ కొరకు ఉచితంగా హద్దు రాళ్లను ఏర్పాటు చేయడం శాశ్వత హక్కు ఖచ్చితమైన భూ, రెవిన్యూ రికార్డులు ఏర్పాటు చేయడం ప్రతి కమతానికి మ్యాపింగ్ ఆధారం మాదిరిగా విశిష్ట నెంబర్ ఏర్పాటు అభ్యంతరాలు పరిష్కరణ కొరకు మొబైల్ బృందాల ఏర్పాటు కూడా ఉంటాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డివిజన్ లోని 17 మండలాల సర్వేయర్లు,  బిల్లా పురం గ్రామ ప్రజలు,  సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: