పారిశుద్ధాన్ని మెరుగుపరచండి
ఎంహెచ్పిఎస్ నాయకులు
కమిషనర్ కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల పట్టణంలో బాలికల హైస్కూల్ లో రోడ్డుపై మురికి నీళ్లు వరదలా పారుతుందని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు Smd. యూనుస్ కమిషనర్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే పరిష్కరించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే నంద్యాల ఆర్టీసీ బస్టాండ్, విక్టోరియా రీడింగ్ రూమ్ దగ్గర ఉన్న చిన్నమయ్య విద్యాలయం లాక్ డౌన్ కరోనా సమయం అనంతరం 8వ తరగతి, 9, 10వ తరగతుల విద్యా బోధనలు ప్రారంభం అయిన సందర్బంగా అక్కడ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురిఅవుతున్నారని, స్కూల్ ఆవరణలో ఆటోల ఇబ్బంది లోనికి వచ్చే దారి కాలువలు నిండి మురికి వాసన కుళ్ళిన వాసనా తట్టుకోలేక పోతున్న విద్యార్థులు స్కూల్ టీచర్స్ ఎవరికీ చెప్పిన ప్రయోజనం లేదు అన్నే ధోరణి అధికారులు వెంటనే స్పందించి అక్కడ వ్యాపారం చేస్తున్న హోటల్ యాజమాన్యం వారు వేసే మురికి నీరు స్కూల్ ముందుకు వచ్చి ఆగటం వలన స్కూల్ కు వెళ్లే పిల్లలు రోగాల బారిన పడకుండ కాపాడవలసినదిగా మున్సిపల్ అధికారులకు ఆ ఏరియా సచివాలయ ఉద్యోగులకు వేడుకుంటున్నామని, అయ్యా మీరు వెంటనే స్పందించి చిన్న పిల్లల ఆరోగ్యం కాపాడవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. ఇందులో నందమూరి నగర్ నూర్ భాష, అబ్బాస్ అలీ, హనీఫ్, మహమ్మద్ కైఫ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: