నలభై ఏళ్ల అనుభవం అంటే ఇదేనా?

సభా సంప్రదాయాలను దిగజార్చడమేనా?

ముస్లిం హక్కుల పోరాట సమితి  జిల్లా అధ్యక్షులు ఎస్ఎండి యూనుస్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

శాసనసభ సంప్రదాయాలను దిగజారుస్తు మైనార్టీ శాసన సభ్యుడిని వేలు చూపుతూ హెచ్చరించడం చాలా దారుణమని ముస్లిం హక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులు యూనుస్ అన్నారు. మంగళవారం ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో మైనార్టీలకు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మైనార్టీలను ఆర్థికంగా దెబ్బతీసి చంద్రబాబు తన మంత్రి వర్గంలో కనీసం ముస్లింలకు స్థానం కల్పించలేని  వ్వక్తి  అని అన్నారు. జమాతే ఒలమా హింద్ నంద్యాల అధ్యక్షులు మౌలానా ఖలీల్  మాట్లాడుతూ ముస్లింలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక అవడం చాలా తక్కువ అని ప్రస్తుతం అసెంబ్లీలో కేవలం నలుగురు మాత్రమే శాసన సభ్యులుగా ఉన్నారని, విదేశాలలో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాలలో ప్రవేశించి శాసనసభ్యునిగా ఎన్నికైన హాఫిజ్ ఖాన్ కర్నూల్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని,  అటువంటి మైనార్టీ శాసనసభ్యుడ్ని  అవమాన పరిచే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. ఈ విషయమై చంద్రబాబు హాఫిజ్ ఖాన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో బొత్స సత్యనారాయణ  శాసన మండలిలో శాసన మండలి చైర్మన్ షరీఫ్ ను  నువ్వు ముస్లింలకే పుట్టావా అని సంబోధించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీలకు, పార్టీల నాయకులకు ముస్లింల ఓట్లు కావాలి గానీ ముస్లింల మనోభావాలు పట్టవన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పోరాట సమితి నాయకులు నూర్ బాషా, హిదాయత్, ఏపియమ్డబ్ల్యూఓ జిల్లా అధ్యక్షులు సయ్యద్ గులాబ్ భాష,  ఏ కే హెచ్ కోశాధికారి పఠాన్ సల్మాన్ ఖాన్,   కైఫ్ తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: