కేసుతో సరిపోదు...

ఎమ్యెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే 

రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకోవద్దు

రేపు పటాన్ చెరువుకు టీయూడబ్ల్యూజే సైన్యం


(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

విలేకరి సంతోష్ నాయక్ ను బెదిరించడంతో పాటు, అసభ్యకర పదజాలంతో దూషించిన పటాన్ చెరువు ఎమ్యెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కేసు నమోదైనంత మాత్రనా తాము శాంతించేది లేదని, జర్నలిస్టులకు, మీడియాకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు డిమాండ్ చేశారు. జర్నలిస్టులను దూషించడం, బెదిరింపులకు గురిచేయడం ఇది కొత్త కాదని, పద్దెదేండ్ల క్రితం ఆయన ఎంపీపీ అధ్యక్షుడిగా కొనసాగిన రోజుల్లో కూడా అక్కడి జర్నలిస్టుల పట్ల ఇదే వైఖరిని అనుసరిస్తే అప్పటి ఏపీయూడబ్ల్యూజే సంఘం అతనికి సరైన రీతిలో బుద్ధి చెప్పిందని శేఖర్, విరాహత్ అలీలు గుర్తుచేశారు. అతను ఎమ్యెల్యే అయ్యాక కూడా తన ప్రవర్తన మార్చుకోలేదని, ఇది మూడో సంఘటన అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పటాన్ చెరువు సంఘటనను కొన్ని రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకునే వైఖరి మంచిది కాదని వారు సూచించారు. జర్నలిస్టుల ఐక్య పోరాటాలతోనే వీటిని తిప్పిగొడతామని, మీడియా పట్ల గానీ, జర్నలిస్టుల పట్ల గానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఇలాంటి చేష్టలకు పాల్పడితే సరైన రీతిలో బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఎమ్యెల్యే వైఖరి పట్ల నిరసన తెలిపేందుకు రేపు పటాన్ చెరువుకు టీయూడబ్ల్యూజే సైన్యం తరలివెళ్లనున్నట్లు వారు స్పష్టం చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: