అమ్మ జ్ఞాపకార్థం...

 నటుడు అలీ సాయం

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

నటుడు అలీ తల్లి జైతూన్‌ బీబీ చనిపోయి నేటికి ఏడాది అయ్యింది. ఆమె సంవత్సరీకానికి ఏదన్నా చేయాలనుకున్నారు అలీ. ఈ విషయం గురించి అలీ మాట్లాడుతూ – ‘‘పేదవారికి,  అనాథాశ్రమాలకు వెళ్లి భోజనం పెడితే ఒక్క పూటతో పోతుంది. అలా కాకుండా ఏం చేయాలి? అనుకున్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. మా అమ్మ ఎప్పుడూ శాలువానో, దుప్పటో కప్పుకుని ఉండేది. ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది. అందుకే  ఆమె జ్ఞాపకార్థం హైదరాబాద్‌లోని క్యాన్సర్‌ హాస్పిటల్‌ దగ్గర, బస్టాండ్‌ల వద్ద ఉండేవారికి దుప్పట్లు పంచాలనుకున్నాను. మా అమ్మ వెచ్చని జ్ఞాపకాలతో చేస్తున్న ఈ సాయం ఎందరినో చలి నుంచి కాపాడుతుంది. ఇది పబ్లిసిటీ కోసం చెప్పటం లేదు. ఇలా ఎప్పటికప్పుడు నా వంతుగా ఏదొకటి చేయడం నాకు ఆత్మసంతృప్తినిస్తుంది’’ అన్నారు అలీ. తన తండ్రి మహమ్మద్‌ బాషా పేరు మీద ఏర్పాటు చేసిన ‘మహమ్మద్‌ బాషా చారిటబుల్‌ ట్రస్ట్‌’ ద్వారా అలీ ఈ సాయం అందించారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: