పది రూపాయల వైద్యానికి సన్మానం

డాక్టర్ నూరీ పరీని సన్మానించిన ముస్లిం ప్రజా సంఘాలు

(జానోజాగో వెబ్ న్యూస్-కడప ప్రతినిధి)

పది రూపాయలకు వైద్యం చేసే డాక్టర్ నూరీ పరీ కు సన్మానించిన ప్రజా సంఘాలుకడప పట్టణంలోని రహమతీయ ఫంక్షన్ హాల్ లో పీడిత బీద ప్రజలకు పది రూపాయల కు వైద్యం చేస్తూ కుల మతాలకు అతీతంగా సేవచేస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్ నూరీ పరీ ను ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన సన్మానించారు.
ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ఇలాంటి సేవాభావంతో పనిచేసే వైద్యులు ప్రతి పట్టణంలో ఒకరు ఉంటే బీద సామాజిక వర్గాలకు ఊరట ఉంటుందని ఇలాంటి వైద్యులకు ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క వైద్యులు బీద అట్టడుగు వర్గాలకు వైద్య విషయంలో సహకారం అందిస్తే మానవ విలువలు పెరుగుతాయని అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో ఎం ఎం డీ ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాషా జానో జాగో అధ్యక్షులు నిసార్. ఎం ఆర్ ఎఫ్ అధ్యక్షుడు దస్తిగీర్ మద్య పాన నిషేధం ఉద్యమ కారుడు హసన్ షరీఫ్.తదితరులు డాక్టర్ నూరీ పరీను ప్రశంసిస్తూ సన్మానించారు.





 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: