పశ్చిమ ప్రకాశంలో పర్యటించే హక్కు లోకేష్ కు లేదు

చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం వల్లనే వెలుగొండ జాప్యం

గతంలో వ్యవసాయం దండగన్న టీడీపీ

రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్న టీడీపీని ఎవరు నమ్మరు

లోకేష్ పర్యటన ప్రచారం కోసమే తప్ప రైతులకోసం కాదు

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

పశ్చిమ ప్రకాశం వెనుకబాటుతనానికి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసిన చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్ కు మార్కాపురం డివిజన్ లో పర్యటించే నైతిక హక్కు లేదని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నివార్ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన లోకేష్ పర్యటనను డాక్టర్ ఏలూరి తీవ్రంగా తప్పు పట్టారు. గతంలో అధికారంలో వున్నప్పుడు టీడీపీ వ్యవసాయం దండగ అని పదే పదే పేర్కొన్న చంద్రబాబు నేడు రైతులపై మొసలి కన్నీరు కార్చడం విడ్డురంగా వుందని విమర్శించారు. 

 గతంలో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని బషీర్ బాగ్ లో ఉద్యమం చేసిన రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుకే దక్కిందని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించిన ఘనత నాడు వైఎస్ ది కాగా, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దక్కుతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తు, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తుందని అన్నారు.  రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా కన్నీరు పెట్టుకోకుండా వుండే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికలు రూపొందించి అమలుజరుపుతుంటే మరోవైపు ప్రజల్లో ఉనికి కోల్పోతున్న టీడీపీ గుర్తింపు కోసం తీర్ధ యాత్రలు పేరుతో హంగామా చేస్తుందని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విమర్శించారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: