పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి...?

ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనే కరెక్ట్ అన్న యోచనలో కాంగ్రెస్ అధిష్టానం

సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒకవైపు అసమ్మతి సెగలు రేపుతున్న తరుణంలో యువనేత ఎం.పి రేవంత్ రెడ్డి కే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను గాడిన పెట్టే దిశగా కేంద్ర కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును సైతం పరిగణలోకి తీసుకున్నా. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచి, యువతకు ప్రోత్సహించే విధంగా ఉండాలంటే యువతను ఆకట్టుకొనే నేతే పీసీసీ అధ్యక్షుడిగా  ఉండాలని  పార్టీ అధిష్టానం యోచిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎంపి.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యువత ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉందని, మాటల తూటలతో ప్రతిపక్ష పార్టీలపై దాడి చేసే సామర్థ్యం ఉండడం వల్ల అధ్యక్ష పదవిని కట్టబెట్టడమే మేలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అదే సందర్బంలో కాంగ్రెస్ లోని నేతలంతా ఒక్క తాటిపై నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి. ఢిల్లీ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి  వచ్చినట్లు సమాచారం. రాబోవు శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కసరత్తు చేస్తోంది. రేవంత్ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి రేవంత్ రెడ్డి నే ఎన్నుకునే అవకాశం ఉంది. త్వరలో ప్రకటనను అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీనియర్ నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

✍️ రచయిత-డి.అనంత రఘు

 న్యాయ వాది....సీనియర్ జర్నలిస్ట్

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: