షురూ కానీ కోర్టులు... 
కక్షీదారులు, న్యాయ వాదులకు శాపంగా మారిన పరిస్థితులు
షురూ కాని కోర్టులు!!::: కరోనా మహామ్మారి వల్ల కోర్టుల ప్రారంభానికి ఇబ్బందిగా మారింది. కక్షీదారులు, న్యాయ వాదులకు తీరని శాపంగా మార్చేసింది. ఇప్పటవరకూ పూర్తి స్థాయిలో కోర్టులు షురూ కాలేదు. కరోనా జాగ్రత్తలు పాటించి ప్రారంభించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఏం.పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల పై గతంలో నమోదైన కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన అన్ని జిల్లా, నియోజక వర్గ నేతలపై ఉన కేసులను విచారించేందుకు నాంపల్లి క్రిమినల్ కోర్టులో ప్రత్యేక కోర్టు ను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీ ల వెంట ఉండే అనుచరులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు కిక్కిరిసి పోతోంది. సామాజిక దూరం పాటించాల్సిన పరిస్థితులు కనుమరువుతోంది. ఇలాంటి సమయంలో ఇతర కోర్టులు కూడా ప్రారంభిస్తే త ప్పెంటని కక్షీ దారులు అంటున్నారు. నేతల కోసం ప్రత్యేక కోర్టును ప్రారంభించిన విధంగానే నాంపల్లి క్రిమినల్ కోర్టు లు కూడా ప్రారంభిస్తే బాగుంటుందని న్యాయ వాదులు అంటున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించి కోర్టులు పూర్తి స్థాయిలో ప్రారంభించాలని కక్షీధారులు కోరుతున్నారు. హైకోర్టు చీఫ్ జస్టీస్ గా భాద్యతలు చేపట్టబోయే హి మా కోహ్లీ ఆదేశాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు జిల్లా జడ్జీ, యించార్జ్ తుకారాం జీ నిర్ణయం పట్ల న్యాయ వాదులు సైతం ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఏదిఏమైనా కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించి పూర్తి స్థాయిలో కోర్టులు షురూ చేయాలని ఆశిద్దాం....
డి. అనంత రఘు
అడ్వకేట్. Ex. Executive member of MCCBA
Nampally Courts.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: