మాసూల్దార్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో...
పెళ్లి కానుక గా పేద ముస్లిం వధువు కు డబుల్ కాట్ టేకు మంచము బహుకరణ
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన మాసూల్దార్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం వధువుకు డబుల్ కాట్ టేకు మంచం బహుకరించారు. నంద్యాలలోని స్థానిక సలీం నగర్ లోని మాసూల్దార్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ నంద్యాల బ్రాంచ్ నందు సొసైటీ తరుపున పేద ముస్లిం వధువు సలీం నగర్ వాస్తవ్యులకు ఉచితంగా మా సహాయంగా 12 వేల రూపాయలు విలువగల డబుల్ కాట్ టేకు మంచమును ఇవ్వడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఇంకా ఎవరైనా పేదవారు ఉంటే మా సొసైటీ ఆశ్రయించిన వారికి మా వంతు సహాయం చేయడానికి ముందుగా ఉంటామని తెలుపుతున్నాము. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఫరూక్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అహ్మద్ హుసేన్ వారితో కలిసి స్థానిక సలీం నగర్ లో పేద వధువు తల్లి జమృద్ నెల కిందట మా ఆఫీసు నందు సంప్రదించగా మేము ఈ సహాయం చేయడానికి ముందుకు వచ్చామని తెలిపారు అలాగే కరోనా వల్ల పేదవారికి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని జగన్ ప్రభుత్వాన్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్లను ఆదుకోవాలని కోరారు వీరిని ప్రభుత్వాలు ఆదుకునే అవసరం చాలా ఉంది గత ప్రభుత్వాలు మాదిరిగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు త్వరగా ప్రారంభించి పేద వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వధువు తల్లి జమృద్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు సొసైటీ వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రెటరీ షేక్ అబ్దుల్లా, సొసైటీ మెంబెర్స్ ఫ్రూట్ కలాం, యువకులు ఎపి గ్రానెట్స్ ఇలియాస్ , సాఫ్ట్ వేర్ ఫరూక్ , రియాజ్ , అహ్మద్ హుస్సేన్, , శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: