అంబేద్కర్ కు చింతా మోహన్ రావు నివాళి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత, డా. బీ.ఆర్.అంబేడ్కర్ 64 వ వర్థంతి సందర్భంగా, ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతా మోహన్ రావు బొమ్మల సత్రం లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివళులర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల అసెంబ్లీ ఇంఛార్జి డాక్టర్ చింతా మోహన్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానుభావుడు అని కొనియాడారు. ప్రస్తుతం రాజకీయాల్లో మనం చూస్తుంటే అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ప్రవర్తించడం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం ఏ ప్రభుత్వం అయినా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే గలిగినప్పుడే వారి మనుగడ సాధ్యం అవుతుంది రాజ్యాంగానికి తూట్లు పొడవాలని ప్రయత్నాలు చేసినప్పుడు అటువంటి వారు ప్రభుత్వాలను నడపడానికి ఆహా రూలు కాదు అని తెలుస్తుందిభారత రాజ్యాంగ నిర్మాణం లో డ్రాఫ్టింగ్ కమిటీ పని తీరు వివరిస్తూ, అంబెడ్కర్ గారి కృషిని కొనియాడారు భారత రత్న అంబెడ్కర్ గారి ఆశయ సాధనకై అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్యా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణం లో అంబెడ్కర్ గారి పాత్ర నిర్వచించలేనిదని, ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, జిల్లా ట్రెజరర్ ఎస్ వై డి ప్రసాద్, యూత్ కాంగ్రెస్ నాయకులు పసుపుల అజయ్, ఆంజనేయులు, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: