భవిష్యత్తులో భారీ పెట్టుబడులు
ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్ ఆర్ ఎస్‌ఎస్ రావు
(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ ప్రతినిధి)
మార్పును నిర్వహించడంలో ఇండియన్ ఆయిల్ ఎల్లప్పుడూ ముందే ఉంటుందని, ప్రస్తుత ఇంధన నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటుగా పూర్తి ఆటోమేషన్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో వాటిని వృద్ధి చేస్తున్నామని ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్ ఆర్ ఎస్‌ఎస్ రావు అన్నారు. సోల రైజేషన్‌తో పర్యావరణ అనుకూలంగానూ మారుస్తున్నామని. భవిష్యత్‌లో సైతం మేము ఈ దిశగా భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారంనాడు విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 2020–21 సంవత్సరానికిగానూ ఇండియన్ ఆయిల్‌కు ఎల్‌పీజీ మార్కెట్ వాటా 35.5%గా ఉందని, ఇక్కడ వంట గ్యాస్‌లో 259 టీఎంటీ(వెయ్యి మెట్రిక్ టన్నులు) అమ్మకాలను చేసిందన్నారు. ఈ కాలంలోనే 10 నూతన ఇండేన్ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లు ప్రారంభమయ్యాయని. మొత్తానికి డిస్ట్రిబ్యూటర్‌ల సంఖ్య 444కు చేరిందని, ఇండియన్ ఆయిల్ ఇప్పుడు ఇండేన్ ఎల్‌పీజీని 49.07 లక్షల వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్‌లో 444 ఇండేన్ డిస్ట్రిబ్యూటర్‌ల ద్వారా సరఫరా చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ ఆయిల్‌కు మూడు ఇండేన్ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్‌లు ఉన్నాయని. కడప, వైజాగ్, కొండపల్లి (విజయవాడ). ఇది వార్షికంగా 360 థౌజెండ్ మెట్రిక్ టన్నులు (టీఎంటీపీఏ) సామర్థ్యంతో ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఎల్‌పీజీ స్టోరేజీ సామర్థ్యం 6800 మెట్రిక్ టన్నులుగా ఉంది. వీటితో పాటుగా మూడు బాట్లింగ్ ప్లాంట్స్ ద్వారా ప్రతి రోజూ ఒక లక్ష కు పైగా సిలెండర్లకు ఇంధనం నింపుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌పీజీ డిమాండ్‌ను సమర్థవంతంగా భర్తీ చేయడానికి, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరువద్ద 167 కోట్ల రూపాయల పెట్టుబడితో, 120 టీఎంటీపీఏ గ్రాస్ రూట్ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయనున్నాము. దీనిద్వారా ప్రతి రోజూ మరో 36వేల ఎల్‌పీజీ సిలెండర్లను రాష్ట్రంలో ఇండియన్ ఆయిల్ ఔట్‌పుట్‌కు జోడించనున్నారు. ఇక్కడ పేర్కొనబడిన ప్రాజెక్టు జూలై 2022 పాటికి కార్యకలాపాలు ఆరంభించనుందని, ఇది ఇండేన్ ఎల్‌పీజీ బాట్లింగ్ సామర్థ్యాన్ని రోజుకు 1. 4 లక్షల సిలెండర్లకు తీసుకువెళ్లనున్నదని తెలిపారు. నూతన అఖిల భారత నెంబర్ 77189–55555 ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఇండేన్ వంట గ్యాస్ బుకింగ్‌ను సులభ సాధ్యం చేయడమైనది. ప్రాజెక్టు పెట్టుబడులు: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1689 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి ఇండియన్ ఆయిల్ ప్రణాళిక చేసింది (పెట్రోల్ ఉత్పత్తుల మౌలిక వసతులు 1522 కోట్ల రూపాయలు మరియు ఎల్‌పీజీ 167 కోట్ల రూపాయలు) విజయవాడ టర్మినల్ పునరుద్ధరణ: ప్రస్తుతం విజయవాడలోని కొండపల్లి వద్దనున్న పెట్రోలియం స్టోరేజీ టర్మినల్ వద్ద సదుపాయాలను పునరుద్ధరించడంతో పాటుగా నిల్వ సామర్థ్యం పెంపొందించడానికి 316 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ టర్మినల్‌ను టాప్ ఆఫ్ పాయింట్ (TOP) టర్మినల్‌గా రాబోతున్న పారాదీప్– హైదరాబాద్ పైప్‌లైన్ (పీహెచ్‌పీఎల్) కోసం వినియోగించనున్నారు. ఈ టర్మినల్ సెప్టెంబర్ 2021నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది.
వైజాగ్ సమీపంలో నూతన టర్మినల్ : ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలియం ఇంధనాలకు వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను భర్తీ చేయడానికి, ఇండియన్ ఆయిల్ సరికొత్త టర్మినల్‌ను ఏర్పాటుచేయబోతుంది. ఇది వైజాగ్ సమీపంలోని అచ్యుతాపురం వద్ద 60 ఎకరాల విస్తీర్ణంలో 466 కోట్ల రూపాయల పెట్టుబడితో 74వేల కిలో లీటర్ల (కెఎల్) స్టోరేజీ సామర్ధ్యంతో వస్తుంది. ఈ టర్మినల్ త్వరలోనే రాబోతున్న పారాదీప్–హైదరాబాద్ ప్రోడక్ట్ పైప్‌లైన్‌కు ట్యాప్ ఆఫ్ పాయింట్‌గా నిలువనుంది. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెట్రోలియం ఉత్పత్తులు (ఎంఎస్/హెచ్‌ఎస్‌డీ) అవసరాలను తీర్చనుంది. ఈ ప్రాజెక్ట్ జూలై 2021 నాటికి పూర్తి కానుంది. అదే సమయంలో అన్ని వైట్ ఆయిల్స్ (పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్) ను నెమ్మదిగా ఈ నూతన టర్మినల్‌కు ప్రస్తుతం వైజాగ్‌లోని మల్కాపురం టర్మినల్ నుంచి మారుస్తాము. బ్లాక్ ఆయిల్ సరఫరాను మల్కాపురం టర్మినల్ నుంచి కొనసాగించనున్నారు. దీనిని 355 కోట్ల రూపాయలతో పునరుద్ధరించనున్నాము. ఈ పునరుద్ధరణ ఫిబ్రవరి 2023 నాటికి పూర్తికాగలదు.
గుంతకల్‌లోని నక్కనదొడ్డి వద్ద నూతన డిపో: అత్యాధునిక సదుపాయాలతో రైల్ ఫెడ్ డిపోను గుంతకల్‌లోని నక్కనదొడ్డి వద్ద 83 ఎకరాల విస్తీర్ణంలో 55వేల కిలో లీటర్ల స్టోరేజీ సామర్థ్యంతో 385 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్నాము.
ఈ నూతన డిపో అనంతపురం, కర్నూలు మరియు కడప జిల్లాల పెట్రోలియం ఉత్పత్తులు (పెట్రోల్/డీజిల్)అవసరాలను తీర్చడంతో పాటుగా గుంతకల్, గుత్తి, డోన్ రైల్వే కన్స్యూమర్ డిపోల అవసరాలను సైతం తీర్చనుంది.
పర్యావరణ అనుమతులు సహా అన్ని చట్ట పరమైన అనుమతులు ఎన్‌ఓసీలు ప్రాజెక్టు కోసం వచ్చాయి. ఈ నూతన రైల్ ఫెడ్ డిపో మార్చి 2021 నాటికి కార్యకలాపాలు ఆరంభించవచ్చు.
బయోఫ్యూయల్స్: బయోఫ్యూయల్స్‌ను మిళితం చేయాలనే భారత ప్రభుత్వ ప్రయత్నాలకు అనుగుణంగా అంటే ఇథనాల్‌ను పెట్రోల్‌తో మరియు బయో డీజిల్‌ను డీజిల్‌తో కలపడానికి అనుగుణంగా మేము మా డిపోలలో ట్యాంక్‌లను ఆధునీకరించాము. వైజాగ్, విజయవాడ, ఒంగోలు, చిత్తూరు టర్మినల్స్ వద్ద 10% ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను సరఫరా చేస్తున్నాము. 7% బయో డీజిల్ మిళితం చేసిన డీజిల్‌ను వైజాగ్, విజయవాడ, రాజమండ్రి టర్మినల్స్‌లో సరఫరా చేస్తున్నాం. అంతేకాదు, 2వేల కిలోలీటర్ల ఇథనాల్ మరియు 1000కిలో లీటర్ల బయో డీజిల్ ట్యాంక్‌లను మార్చడం కోసం చిత్తూరు టర్మినల్ వద్ద 8 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజెక్ట్ చేపట్టినట్లు వివరించారు.
Post A Comment:
0 comments: