ప్రభుత్వం ఉంచిన బాధ్యతను నెరవేర్చుద్దాం

మండల విద్యాశాఖ అధికారి రాందాస్ నాయక్

మండల విద్యాశాఖ అధికారి రాందాస్ నాయక్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం మండలములోని మండల విద్యాశాఖ కార్యలయంలో మండల విద్యాశాఖ అధికారి  రాందాస్ నాయక్ ఆధ్వర్యములో తమ మండలములోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరితో సమావేశం ఏర్పాటుచేశారు. బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన డిప్యూటి విద్యాశాఖ అధికారి అత్తోట కిరణ్ కుమార్ ను ఈ కార్యక్రమంలో పరిచయం చేశారు. ఈ కార్యక్రమములో మండల విద్యాశాఖ ఆధికారి రాందాస్ నాయక్ మాట్లాడుతూ పాఠశాలలకు సంబంధించిన “ అమ్మఒడి”, “ నాడు - నేడు “ కార్యక్రమాలను అమలుచేసే విషయంలో పాటించవలసిన విధివిధానాల గురించి తెలియజేశారు.
నూతన డిప్యూటీ విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్
ప్రభుత్వం తమపై వుంచిన నమ్మకానికి అనుగుణంగా అందరితో మమేకమై సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. నూతన డిప్యూటీ విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమదైన శైలిలో              “ గురువు”  యొక్క విశిష్టతను, నైతిక విలువల ప్రస్ధావనలతో, అనేక  సందర్భాలలో తమకు జరిగిన అనుభవాలను సమావేశానికి హాజరైన వారితో పంచుకొన్నారు. అలా ఆయన అందరి హృదయాలను ఆకట్టుకునే విధంగా ప్రసంగించారు. చివరిగా ఇటువంటి కార్యక్రమము ఏర్పాటు చేసి నాకు  అందరితో పరిచయం చేసుకునే అవకాశం   కల్పించిన మండల విద్యాశాఖ అధికారి గారికి మరియు ఈ కార్యక్రమములో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియచేశారు.




 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: