ఆ చట్టాలను రద్దు చేయాలి

జానోజాగో, ఐయూఎంఎల్ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఐయూఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా,  జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. మంగళవారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు  మాట్లాడుతూ బంగారు గని లాంటి ఈ దేశ ఆహార ధాన్యాల మార్కెట్ పై అంబానీ ,అదానీ తదితర కార్పోరేట్ల కన్ను పడింఅయితే వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అవేమిటయ్యా అంటేవ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉండడం ,రైతులనుండీ ధాన్యం కొనుగోలు చేయాలంటే  ఒక్కో రాష్ట్రం లో ఒక్కో రకమైన నియమ నిబంధనలు అమల్లోఉండడం.

 
ఇన్నిరకాలనియమాలూ ,పన్నువిధానాలూ ఉండడం కార్పోరేట్లకు చీకాకుగా మారింది.మోదీ సర్కార్ చూపిన పరిష్కారం ఏమిటంటే...రాష్ట్రాల అధికారాలు లాగేసుకుని ఒక దేశం ,దేశమంతా ఒకే చట్టం చేసిపారేయడం.ఆహార పంటలను నిత్యావసర సరుకుల చట్టం పరిధినుండీ తీసేయడం. ధాన్యాలనూ , ఇతర ఉత్పత్తులను బుద్ధి పుట్టినన్ని రోజులు నిలవ చేసుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వడం. రైతులకు ఏదైనా నష్టం జరిగి కోర్టుకు పోతే కార్పోరేట్లకు చాలా ఇబ్బంది.రైతులు కోర్టులకు కాకుండా జిల్లా కలెక్టర్ల కే తమ ఫిర్యాదులు చెప్పుకోవాలని చట్టం చేసేయడం.కార్పోరేట్లు ఖుషోఖుషి. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా దేశంలో సంపదను దోచుకెళ్లిందో,అచ్చంఅలాగేఆడాని,అంబానికంపెనీలుదోచుకుంటున్నాయి ఇప్పటికైనా రైతుకడుపుకొట్టేచట్టాలను తీసివేయాలని రైతు శ్రేయస్సు పాటుపడాలని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా  ఐ యు ఎమ్ ఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా అన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: