పరిమితికి మించి అమ్మినా..అక్రమంగా తరలించిన కఠిన చర్యలు
ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవ రావు
మహానందిలో ప్రతేక పూజలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవ రావు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
ప్రభుత్వ మద్యం షాపుల నుండి మద్యాన్ని పరిమితికి మించి అక్రమంగా మధ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవ రావు హెచ్చరించారు. మహానందికి దైవ దర్శనార్ధమై వచ్చిన ఆయన మాట్లాడుతూ ప్రతి మూడు లేదా నాలుగు మద్యం దుకాణాలకు ఒక కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ ను పర్యవేక్షణ కోసం నియమించామని పేర్కొన్నారు. మద్యం ప్రభుత్వ దుకాణాల నుండి అక్రమంగా తరలించి బెల్టుషాపులు నిర్వహిస్తే పర్యవేక్షణ కోసం నియమించబడ్డ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీరిపై పర్యవేక్షణ కోసం ఎక్సైజ్ ఎస్సై, సిఐ ఉన్నట్లు తెలిపారు. వారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నంద్యాల డివిజన్లో మద్యం, సారా వ్యక్తుల నుండి అమ్మకాలు ప్రోత్సహించి మామూళ్లు వసూలు చేసినా అలాంటి వారి వివరాలు తనకు తెలియజేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కోరారు. గతంలో బెల్టుషాపులు నిర్వహించి ప్రస్తుతం ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నవారిని కూడా మామూలు కోసం వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని, వెంటనే తనకు తెలియజేయాలని సూచించారు. బెల్టు షాపుల నిర్వహణ ప్రోత్సహించిన దాడులకు సంబంధించిన సమాచారాన్ని నిర్వాహకులకు ముందుగానే తెలియజేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రైమ్ కంట్రోల్ బాధ్యత seb అధికారులకు ప్రభుత్వం కల్పించిందని, తాము కేవలం డిపోల నుండి మద్యాన్ని షాపులకు చేరవేయడం, షాపుల నుండి పరిమితికి మించి బయటికి మద్యాన్ని తరలించకుండా ఉండేందుకు మాత్రమే తమకు అధికారాలు ఉన్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాలు తమ పరిధిలో ఉన్నాయని, అనంతపురంలో seb డిప్యూటీ కమిషనర్ కార్యాలయం త్వరలో ఏర్పాటు అయ్యే అవకాశం ఉందన్నారు.
Post A Comment:
0 comments: