హోంమంత్రి మాట నిలబెట్టుకోవాలి

 అబ్దుల్ సలాం న్యాయపోరాటం కమిటీ డిమాండ్


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో ఇక్రా  స్కూల్ పాఠశాల నందు అబ్దుల్ సలాం పోరాట కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్  సలాం న్యాయ పోరాటం రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ గత నెల 3 వ  తేదీ  అబ్దుల్ సలాం కుటుంబం రైలు కిందపడి పోలీసులు వైసిపి నాయకులు నిమిషాంబ షాపు యజమాని ఓనరు గంగిశెట్టి శ్రీధరు అందరి హరాస్మెంట్ తో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నంద్యాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ పోరాట   ఫలితంగా శాసనసభలో చర్చకు వచ్చిన సీఎం గారు ఇప్పటివరకు ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. అదే శాసన మండలి లో ఎమ్మెల్సీ ఫరూక్  గారు చర్చ పెట్టి సి.బి.ఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా హోంమంత్రి గారు సిబిఐ విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తక్షణమే హోం మంత్రి గారు సీఎం తో మాట్లాడి సిబిఐ విచారణ ఏర్పాటు చేసిన హామీని నిలబెట్టుకోవాలని లేనియెడల మీ పదవిని రాజీనామా చేసి మౌలానా ముస్తాక్ అహ్మద్ డిమాండ్ చేశారు. అబ్దుల్ సలాం పోరాట కమిటీ లో పాల్గొన్న ముస్లిం ప్రజాసంఘాలు అందరికీ పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు. శాసనమండలిలో చర్చకు తెచ్చిన ఫరూక్ గారికి ధన్యవాదాలు.నేడు శాసనసభలో స్థానిక ఎమ్మెల్యే కూడా సీఎం గారితో చర్చించి సిబిఐ విచారణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  ఈ సమావేశంలో ఆవాజ్  జిల్లా కన్వీనర్ మస్తాన్వలి, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ,ఆవాజ్ పట్టణ అధ్యక్షులు బాబుల్లా, ఐయుఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలాన, వాజ్ నంద్యాల మండల అధ్యక్షులు అక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: