నిస్వార్ధం, నిజాయితీకి మారుపేరు...

ఖాజా రియాసత్ అలీ

ఖాజా రియాసత్ అలీ

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

''తెలంగాణలో పుట్టిన బిడ్డగా  నా బాధ్యతగా  భావించి  నా కొడుకును విరహత్ అలీని మీకందించాను. చరిత్రలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించిన  ఉత్తేజం , ఉద్వేగం నాలో కలుగుతోంది" అని ఒక రాత్రి నిదురలో ఖాజా రియాసత్ అలీ మనకు చెప్పినట్టు కలవరింత కలుగుతోంది. ఉద్యమాల పురిటిగడ్డలో ఉరకలెత్తే ఉత్సాహంతో సరికొత్తగా వచ్చిన ప్రజా ఉప్పెన ప్రత్యేక తెలంగాణ పోరాటం.  ఎన్నో దశాబ్దాలుగా ప్రజావాణితో బాటు, రాజకీయ సంక్షోభాలకు కారణమైన ఉద్యమ తీవ్రత గూర్చి వివరిస్తూ తెలంగాణ కళాకారుల మమేకంతో జన ప్రవాహంలా సాగిన జనజీవిత వ్యవస్థను అద్దంలో చూపిన ప్రయత్నం ఎన్నదగినదే.  కానీ అదే ఉప్పెనకు జీవితాన్నే ధారబోసి, జర్నలిస్ట్ అంటే ఇలాగే ఉంటాడని నిజాన్ని నిగ్గు తేల్చిన వ్యక్తిని మనం చూస్తాము అనుకోలేదు.  ఆ వ్యక్తే విరహత్ అలీ . విరహత్ అలీ అంటే ఎవరు? అతడు ఎక్కడినుంచి వచ్చాడు? అని అందరికీ సందేహమే! అది ఎప్పుడు? ఎప్పుడో చిన్నప్పుడు. కానీ ఇవ్వాళ జర్నలిస్టులందరికీ అతడే ప్రాణం. అతడే జీవితం. అతడికి కూడా జర్నలిస్టులే ప్రాణం. వాళ్లే జీవితం.  నిజంగా చెప్పాలంటే నాకు కూడా.  అందుకే వాళ్ళ  నాన్న నా తరవాత వీడొకడుకలుండాలి అని అనుకున్నాడేమో అనిపిస్తోంది. అందుకే మనకు ఖాజా రియాసత్ అలీ రూపంలో విరహత్ అలీని ఇచ్చాడు. విరహత్ అలీకి పొద్దున్న లేస్తే జర్నలిస్టుల సమస్యలే తప్ప ఇంకోటి తెలియదు . ఇతను మనకోసమే పుట్టడా? అనిపిస్తోంది. ఇదే తరుణంలో  ఖాజా రియాసత్ అలీ 15వ వర్ధంతి వచ్చేసింది. ఇక్కడో విషయం చెప్పాలి. ఇవ్వాళ  తన తండ్రి  ఖాజా రియాసత్ అలీ15వ వర్ధంతి అని మన విరహత్ అలీ అనుకుంటున్నారు.  అది జర్నలిస్టులకు ఓ దిక్చూచి అందించిన విరాహత్ అలీ తండ్రి  ఖాజా రియాసత్ అలీ  15వ వర్ధంతి అని మన విరహత్ కి తెలియదేమో!  ప్రజా నాయకులు రాజకీయ యవనికపై తెలంగాణ ఉధృతపోరాటానికి ఎంతమంది భావుటాలెత్తారు? వారి ఉద్యమ ప్రస్థానం ఎలా సాగింది? అందులో కష్టనష్టాలూ , ఒడి దుడుకులు , ఒక ప్రాంతం విడిపోతే ఎవరికీ ఖేదం? మరెవరికీ మోదం? అన్న ప్రశ్నలు వేస్తూ , వాటికి జవాబులు  కూడా ఎవరికీ వారు చెప్పుకునేటట్టు  విరహత్ అలీ జీవనం సాగింది.  అందుకే  విరహత్ మనకోసమే పుట్టాడు.  ఖాజా రియాసత్ అలీ మనకోసం ఇచ్చిన గిఫ్ట్ గా మీరు.... విరహత్ అలీ ఏమంటారు? 

-ఎం.డి. అబ్దుల్, చీఫ్ సబ్ -ఎడిటర్, ఆంధ్రభూమి (దిన) నంది అవార్డు గ్రహీత, సయ్యద్ నిసార్ అహమ్మద్ (సీఈఓ  జానో జాగో వెబ్ న్యూస్)

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: