నేను పరిశుభ్రతను పాటించి... 

గ్రామపంచాయతీ నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తాను అని ప్రతీన

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యర్థాలపై పోరాట కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని తర్లుపాడు గ్రామంలో ఆదివారంనాడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో  వ్యర్థాల పై పోరాటం కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ముందుగా వ్యర్థాల పై పోరాటానికి సంబంధించిన ర్యాలీ, మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం చేశారు. నేను నా పరిశుభ్రతను గ్రామపంచాయతీ నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తాను. ప్రతి కుటుంబం విరాళం ద్వారా పారిశుద్ధ్యం నిర్మాణంలో నా వంతు బాధ్యత మేము నిర్వహిస్తాను. ఇతరులపై ఆధారపడకుండా నా భాగస్వామ్యం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుట ద్వారా ఆరోగ్యవంతమైన నవ సమాజ స్థాపనకు నా శాయశక్తులా శ్రమిస్తాను.
నా ఇంటిని వ్యాధి రహిత, ఆరోగ్య భద్రత ద్వారా కుటుంబ పొదుపును పెంచుటకు తోడు పడతాను.  మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఫ్లూ, డయోరియా, మరియు కోవిడ్-19 లాంటి మహమ్మారి వ్యాధుల నుండి కుటుంబాన్ని రక్షించు కొనుటలో నా వంతు పాత్ర పోషిస్తాను. అశుభ్రత పై రాజీలేని పోరాటం సాగిస్తాను. నా కుటుంబాన్ని నా గ్రామాన్ని అనారోగ్యం అశుభ్రత లేని స్వచ్ఛమైన, పచ్చని ప్రకృతితో కూడిన కలుషిత రహిత మైనవి గా భావితరాలకు బంగారు బాటలు వేయుటకు తోడు పడతాను.    అనంతరం తర్లుపాడు మండలంలో వ్యవసాయ అధికారి కే.చంద్రశేఖర్ రావు, ఎం పీ ఈవో మద్ది కుంట్ల. ముని కాశయ్య మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రామ రైతులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలెంటర్ల్లు పెద్ద ఎత్తున గ్రామంలోని అన్ని వీధులలో`` చెత్త వేయకు- పాపం చేయకు´ లాంటి నినాదాలతో ర్యాలీనిర్వహించడం జరిగినది.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: