రైతుల పోరాటానికి సంఘీభావంగా...

కొవ్వొత్తుల ప్రదర్శన


(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

రైతు నాయకుడు బీరం రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో ఢిల్లీలో రైతులు చేస్తున్న రైతుల పోరాటానికి కి మద్దతుగా మంగళవారంనాడు సాయంత్రం పార్టీలకు అతీతంగా అన్నదాతకు అండగా కొవ్వొత్తులు వెలిగించి రైతులకు మద్దతుగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీరం రామకృష్ణారెడ్డి   జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ రైతులకు హక్కులను హరించే చట్టాలను వెనక్కి తీసుకోవాలని

 

ఈ చట్టం ద్వారా రైతులు వారి యొక్క హక్కులను కోల్పోతారని ఈ చట్టాలు కార్పొరేట్  వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాయన్నారు.  గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా దేశంలో సంపదను దోచుకెళ్లిందో, అచ్చం అలాగే ఆడాని, అంబాని కంపెనీలు దోచుకుంటున్నాయని విమర్శించారు. జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, బీరం రామకృష్ణారెడ్డి  అన్నారుజ ఈ కార్యక్రమంలో  సి బాలచంద్రారెడ్డి,  బి రాంబాబు, అనిల్ కుమార్ వాల్మీకి, డి రాజా రామ్  పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: