అమ్మఒడి పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల...

అక్రమ వసూళ్లను అరికట్టండి

పీడీఎస్ యూ జిల్లా నేతలు జునైద్  భాష, ఎస్.ఎం.డీ.రఫీ

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

 నంద్యాల డివిజన్ లోని కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అమ్మఒడి రెన్యూవల్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి 1000 నుండి 2000 రూపాయల వరకు అమ్మఒడి దరఖాస్తు ఫీజుల పేరుతో  ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వసూళ్లు చేస్తున్నారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ) జిల్లా అధ్యక్షులు జునైద్ బాషా , జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ ఆరోపించారు. శుక్రవారం స్థానిక నంద్యాల పట్టణంలోని ఉపవిద్యాశాఖాధికారి (డిప్యూటీ డిఇఓ)కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు జునైద్ బాషా,జిల్లా సహాయ కార్యదర్శి రఫీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మఒడి కార్యక్రమంలో కొందరు కార్పొరేట్ ,ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అమ్మఒడి రెన్యువల్ పేరుతో సుమారు ఒక్కొక్క విద్యార్థి మీద 1000 నుండి 2000 రూపాయల వరకు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.అలాంటి పాఠశాలలను విద్యాశాఖ అధికారులు వెంటనే గుర్తించి తక్షణమే వాటి గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలలో పాత పుస్తకాలను కూడా కొందరు అక్రమంగా ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు.తక్షణమే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్పొరేట్ పాఠశాలల్లో  అడ్మిషన్ ఫీజు స్పెషల్ ఫీజు  బుక్స్ పేర్ల మీద విచ్చలవిడిగా  తల్లిదండ్రుల నుంచి  విద్యా సంస్థ యాజమాన్యం దోచుకోవడం జరుగుతున్నది విద్యాశాఖ అధికారులు  స్పందించి అలాంటి స్కూళ్లను గుర్తించి ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని విద్యాశాఖ అధికారులకు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ  జిల్లా నాయకులు నవీన్, డివిజన్ అధ్యక్షులు దస్తగిరి,రవి,నాయక్,వంశీ,వినయ్,కిరణ్, మొదలైన వారు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: