రైతుల మృతి పట్ల...వామపక్షాల సంతాపం

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)

ఢిల్లీ ఆందోళనలో మృతి చెందిన రైతులకు నందికొట్కూరు పటేల్ సెంటర్ లో వామపక్షాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించి సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు నాయకులు భాస్కర్ రెడ్డి బెస్త రాజపకీర్  సాబ్ రజిత సిపిఐ నాయకులు రఘురాం మూర్తి రమేష్ జగదీష్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు వెంకటేశ్వర్లు బి బి న్యూ డెమోక్రసీ నాయకులు మజీథియా అరుణ్ ఆది రమేష్ ఆవాజ్ నాయకులు అబు బాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సమస్యను చట్టాలను రద్దు చేయకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమకారులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు విమర్శించారు ఇప్పటికే 29 మంది రైతులు బలైన మోడీ స్పందించకపోవడం విచారకరమన్నారు రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు విద్యుత్తు ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని గ్రామస్థాయి తీసుకెళ్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు  రేపు నందికొట్కూరు బిఎస్ఎన్ఎల్ కార్యాలయం  ముందు ఆందోళన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: