ఐక్యత చాటిన ఆలేరు జర్నలిస్ట్ లు
(జానోజాగో వెబ్ న్యూస్-పటాన్ చెరువు)
పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి, జైల్ కు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆలేరులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు ర్యాలీ, నిరసనను తెలిపారు. బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ ని నిర్వహించారు. ఎమ్మార్వో శ్యామ్ సుందర్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. అక్రమాలకూ, అరాచకాలకు మారు పేరుగా మారిన గూడెం మహిపాల్ రెడ్డి ని, సీఎం కెసిఆర్ పార్టీ నుండి బహిష్కరించి, ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం లో పాత్రికేయుల పాత్ర మరువలేనిదన్నారు. పత్రిక స్వేచ్ఛను హరించి వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వపాలనలో అరాచకాలు పెరిగి పోయాయన్నారు. అక్రమాలకూ పాల్పడుతున్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బెదిరింపులకు భయపడేది లేదని, ఐక్యత తో ఎదురుకుంటామన్నారు. కలాలకు సంకెళ్లు వేయాలని చూస్తే ..... కాల గర్భంలో కలిపేస్తామన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించి వేస్తె.... పొలిటికల్ లో లేకుండా చేస్తామన్నారు. ఎమ్మెల్యే కబడ్ధార్, టీఆర్ఎస్ నేతల్లారా కబడ్ధార్ అంటూ నినదించారు. ఆలేరు కలం వీరులు కదం తొక్కితే, ఢిల్లీ గద్దె పై కూర్చున్న రారాజులే భయపడి పోతారన్నారు. టీఆర్ఎస్ కుట్రలకు కలాల తోనే సమాధానం చెబుతామన్నారు. వాట్సాప్ మెసేజ్ తోనే కదలి వచ్చి, కాదనా రంగం లో కాలు దువ్విన ఆలేరు కలం వీరులకు ఉద్యమాభివందనాలు. ఇదే స్పూర్తితో ముందుకు సాగుదాం. ఐక్యత తో విజయాన్ని సాధిద్దాం..... ఆలేరు గర్జన తో ఢిల్లీ గద్దె, కెసిఆర్ గుండె అదిరేలా చేద్దాం ... మనమంతా ఒకే కుటుంబమని, అదే కలం కుటుంబ మని చాటుదాం అని ఆలేరుకు చెందిన జర్నలిస్ట్ ఖుర్షీద్ పాషా తెలిపారు.
Post A Comment:
0 comments: