గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడింది

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి)

గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ అనేక అక్రమాలకు పాల్పడింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు. పోలీస్ లు టిఆర్ఎస్ కార్యకర్తల్లాగా పని చేసారన్నారు. కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను టిఆర్ఎస్ నేతలు, పోలీస్ లు వేధిస్తున్నారని,  కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు..పార్టీ పూర్తిగా మీకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. పోలీసులు నిష్పక్ష పాతంగా వ్యవహరించాలన్నారు. రహమత్ నగర్ లో సిరిసిల్ల టిఆర్ఎస్ నాయకులు ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతూ దొరికారు. మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాము, ఈ విషయంలో ఎన్నికల సంఘం మాకు ఒక లెటర్ ఇచ్చారని, లెటర్ లో ఫలయింగ్ స్కాడ్ ను పంపాము, సిరిసిల్ల టిఆర్ఎస్ నాయకులను పట్టుకున్నామని, 15,300 రూపాయలు దొరికాయని ఆయన చెప్పారు. పోలీస్ కమిషనర్ తర్వాత ఇచ్చిన లేఖలో ఎలాంటి డబ్బులు దొరకలేదు అని ఇచ్చారని ఆయన తెలిపారు. అంతే కాకుండా కాంగ్రెస్ నాయకులు ఎఫ్.ఎస్. సి టీమ్ వాహనాల ను పగలగొట్టారని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. ఇంత ఘోరంగా పోలీసులు వ్యవహారిస్తున్నారు. మా అభ్యర్థి భవాని శివశంకర్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలాగే మా కాంగ్రెస్ నాయకులు జాఫర్ హుసేన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారన్నారు. పోలీసులు ఇలా పక్షపాతం తో వ్యవహరిస్తున్నారన్నారు. ఫ్లైయింగ్ స్కాడ్, పోలీస్ ల లేఖలు ఎన్నికల కమిషన్ కు పంపుతాము అని ఆయన తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: