రైతులకు నష్టం కలిగించే ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలి 

సీపీఐ నేత ఇ.చెన్నయ్య డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-గోస్పాడు ప్రతినిధి)

 కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని సిపిఐ పార్టీ గోస్పాడు మండల కార్యదర్శి ఇ  చెన్నయ్య రైతు సంఘం మండల కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారంనాడు దేశ వ్యాప్త బందులో భాగంగా స్థానిక గోస్పాడు లో సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి అనంతరం  బంద్ నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి నరసింహులు ఏఐటీయూసీ మండల అధ్యక్షులు అన్వర్ భాష పసురపాడు సిపిఐ శాఖ కార్యదర్శి జిలాన్ భాష  మౌలా సిపిఎం నాయకులు ఎన్ చెన్నయ్య మార్కు నక్క చెన్నయ్య  తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గత 15 రోజుల నుండి 7 డిగ్రీల ఉష్ణోగ్రత ఎముకలు కొరికే చలిలో పోరాడుతున్న మోడీ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈరోజు వ్యవసాయ చట్టాలను తుంగలోతొక్కి మోడీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో చట్టం చేసింది ఢిల్లీ లో ఎముకలు కొరికే చలిలో శాంతియుతంగా రైతు చట్టాలను రద్దు చేయాలని ధర్నా నిర్వహిస్తున్న రైతుల పై లాఠీచార్జి భాష్పవాయువు ఉపయోగించడం దుర్మార్గమని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం తమకు ఇష్టారాజ్యంగా కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పజెప్పడం రైతులను వ్యవసాయం నుండి దూరం చేయడం కోసం దొంగచాటుగా పార్లమెంటులో ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా దుర్మార్గమైన 3 వ్యవసాయ ఆర్డినెన్స్ ఆమోదించింది ఇప్పటికీ పంటలు కొనడానికి అంబానీ అదాని రిలయన్స్ టాటా బిర్లా ఐటిసి బేయర్ వంటి పెద్దపెద్ద కార్పొరేట్ శక్తులకు సహాయపడేందుకు ఈ చట్టాలను తెచ్చిందని వారు దుయ్యబట్టారు మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతన్నలకు నష్టం కలిగించే ఈ మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు అలా లేని పక్షంలో  వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు నక్కనాగరాజు రవి రాజు కరుణాకర్ గాబ్రేల్ ఊసేని మాలి హాసాన్ మిగతా నాయకులు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: