ఈ జీవితం నాకు దైవ ప్రసాదం

బర్త్ డే సెలబ్రేషన్ లో చిత్ర నిర్మాత రత్నకుమార్

టాలీవుడ్ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ 


రత్నకుమార్ 

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

''ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మెచ్చుకోలుకి, పొగడ్తకి పడిపోయావో అప్పుడు నిన్ను నువ్వు కోల్పోయి, జీవితాంతం...ఆ మనిషిని ప్రసన్నం చేసుకోవడానికి, బానిసలా మారిపోతావు. ఇది 100% నిజం.. నువ్వు వెలుగులో ఉన్నా.. చీకట్లో లో ఉన్నా, నీలో ఉన్న పొగరును మాత్రం తగ్గనీయకు.. నేను ఒక్కటే నమ్ముతాను, ఈ జీవితం నాకు దైవ ప్రసాదం,  ఎన్నాళ్లుంటామో, ఎప్పుడు పోతామో తెలీదు.? బ్రతికినన్నాళ్లూ మానసిక సంతృప్తితో, నిండుకుండలా బ్రతకాలి.. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి.. నీ లైఫ్ నీ కంట్రోల్‌లో ఉండాలి, నీ ఎమోషన్సు నీ కంట్రోల్‌లో ఉండాలి.. సర్వేజనాః సుఖినోభవంతు.. లోకాః సమస్తాః సుఖినోభవంతు" అంటారు  చిత్ర నిర్మాత, రాన్సాక్ ఆర్గా సీఈఓ డా.సి.వి. రత్నకుమార్.

కేక్ తినిపిస్తున్న కూతురు చిన్నారి

ఈ మంచి మాటలు ఆయననెరిగిన వారందరికీ తెలుసు.  ఈనెల 22న రత్నకుమార్ 60 వ జన్మదిన వేడుక కుటుంబ సభ్యులైన తన భార్య శ్రీలక్ష్మి, కుమారుడు భగీరధ, కూతురు చిన్నారితో పాటు స్నేహితుల మధ్య కన్నులపండువగా జరిగిన సంగతి తెలిసిందే.  డిసెంబర్ 22, 1960లో చింతలచెర్వు వెంకటరామారావు-లక్ష్మీ ప్రమీలాదేవిలకు జన్మించిన రత్నకుమార్ తన 60వ జన్మదినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా,  ఉల్లాసంగా, చెరగని చిరునవ్వుతో జరుపుకోవడం గమనార్హం. అయితే  టాలీవుడ్ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ ఏ మాత్రం తగ్గడం లేదు.

భార్య శ్రీలక్ష్మితో రత్నకుమార్

ఎందరో ప్రముఖులు బర్త్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్న చిత్ర నిర్మాత రత్నకుమార్ ను శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తుతున్నారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్, నటులు రాకెట్ రాఘవ, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సయ్యద్ గఫార్, దర్శకుడు ఎన్. శంకర్, తెలంగాణ ప్రొడ్యూసర్ గిల్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకుడు, నిర్మాత ముప్పిడి సత్యం, ప్రముఖ హీరో రాజశేఖర్-జీవిత దంపతులు, ప్రఖ్యాత దర్శకులు ఎన్. శివనాగేశ్వరరావు, హీరో డా.మాదాల రవి, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, చీఫ్ సబ్ -ఎడిటర్ ఎం.డి. అబ్దుల్,  హీరో సుమన్, సీనియర్ నటులు చంద్రమోహన్, జగదీశ్ (మూర్కుడు చిత్ర కెమెరామెన్ ) తదితరులు  చిత్ర నిర్మాత రత్నకుమార్ కు శుభాకాంక్షలు అందజేశారు. 'నిన్న అన్నది గతం..  రేపు అన్నది సంశయం..  నేడు అన్నది నిజం.  అలాంటి ఈ రోజు మీరు ఆనందంగా గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అని' తన స్నేహితులు శుభాకాంక్షలు అందజేశారు. 'మనం అనుకున్నదంతా జరగదు మనకి కావాలి అనుకున్నదంతా దొరకదు. కానీ మనం కష్టపడినా కూడా మనకి దొరక్కపోతాయే దానిని రాసిపెట్టుకోండి .

దాన్నే ఆలోచిస్తూ  సమయాన్ని వృదా చేసుకోవడం ఎందుకు?' అని ప్రశ్నించే రత్నకుమార్  బయో ఉత్పత్తులను రైతుల వద్దకు చేర్చి రైతే రాజ్యంగా నిలిచేలా చేశాడు. రాన్సాక్ ఆర్గా సీఈఓగా  రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేశారు. ఓ వైపు  రాన్సాక్ ఆర్గా సీఈఓ గా భాద్యతలు నిర్వర్తిస్తూనే మరో వైపు చలనచిత్రరంగంలోకి ప్రవేశించి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆటో బయోగ్రఫీ నేపథ్యంతో 'మూర్కుడు' అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం అంతా కొత్తవారితో తెరకెక్కించారు. నిర్మాణాంతర పనులన్నీ పూర్తి చేసుకున్న 'మూర్కుడు' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

 

రత్నకుమార్ మిత్రులతో నిర్మాత లగడపాటి శ్రీధర్ 

అలాగే ఇంకా డా. సి. వి రత్నకుమార్ కు  జన్మదిన శుభాకాంక్షలు అందజేసిన వారిలో నేచర్ అగ్రి సొల్యూషన్సు మేనేజింగ్ డైరెక్టర్ పంచాంగం బాబు వరద రాజేంద్రప్రసాద్,  రాన్సాక్ ఆర్గా జనరల్ మేనేజర్ ఎం. మురళీకృష్ణ, ఆర్గానిక్ ఇండియా  సీఈఓ  సి. వి భరద్వాజ్, విట్రోలైఫ్ సైన్సెస్ సీఈఓ ఘంటసాల కృష్ణ చైతన్య-జానకీ సృజన, ధ్రువ ఆర్యన్ ( రత్నకుమార్ ముద్దులమనవడు),  ఘంటసాల శ్రీ మహాదేవ్, సి.వి విజకుమార్ - వసుంధర, గణేష్ సి.వి.ఆర్ (గవేజ్ ఆర్గానిక్సు), ఐ,.టి.డి.ఏ ఇంజనీర్ మంచికంటి శ్రీనివాసరావు-రుక్మిణి, కలపటం కుటుంబరావు-గిరిజారాణి, సి.వి. మురళీకుమార్- మాధవి, అవినో బయోటెక్ సీఈఓ  ప్రభాకర్-కళ్యాణి, నాగేశ్వరరావు (ఓజోన్ ఆర్గానిక్సు)తదితరులు ఉన్నారు. 

 

సుద్దాల అశోక్ తేజ తో

దేవులపల్లి అమర్ తో  రత్నకుమార్ 

రత్నకుమార్ జన్మదిన వేడుకలో పాల్గొన్న మిత్రులు అబ్దుల్, మురళీకృష్ణ, వరద రాజేంద్రప్రసాద్


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: