ఘనంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు 

పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో మొట్ట మొదటిగా 28వ వార్డ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, రైతు బాంధవుడు,  పేద ప్రజల ఆశాజ్యోతి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నోబెల్ మెడికల్ స్టోర్ అధినేత దాదా ఆధ్వర్యంలో నిరాశ్రయులకు, 28వ వార్డు ప్రజలకు అల్పాహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ ఎస్ ఎండి నౌమన్, తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేసిన  అనంతరం ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ కుమారుడిగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాడని వైయస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో పయనిస్తున్నారని కొనియాడారు డాక్టర్ నౌమన్ మాట్లాడుతూ ఆయన చెప్పిన మేనిఫెస్టో లో ఉన్న ప్రతి అంశాన్ని పథకాలను ప్రజలకు అందించారని ఆయన కొనియాడారు అలాగే ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఇలాంటి సీఎం లేడని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమానికి నంద్యాల మాజీ కౌన్సిలర్లు మరియు వార్డ్ ఇంచార్జ్ లు వార్డు ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా సంబరాలు చేసుకున్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: